తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రిటన్-ఈయూ మధ్య ఎట్టకేలకు కుదిరిన ఒప్పందం​

ఐరోపా సమాఖ్యతో బ్రిటన్​ కీలక వాణిజ్య ఒప్పందం పూర్తయింది. బ్రెగ్జిట్​ గడువుకు కొన్ని రోజుల ముందు ఈ ఒప్పందాన్ని బ్రిటన్ పూర్తి చేసింది. ఈయూ నుంచి అధికారికంగా డెసెంబర్​ 31న వైదొలగనుంది. బ్రెగ్జిట్​ అనంతరం ఈయూ, బ్రిటన్​ మధ్వ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొనసాగనుంది.

UK and EU reach post-Brexit trade agreement
ఈయూతో బంధం తెంచుకున్న బ్రిటన్​

By

Published : Dec 24, 2020, 10:32 PM IST

ఐరోపా సమాఖ్య(ఈయూ)-బ్రిటన్​ల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు పూర్తయింది. దీంతో బ్రెగ్జిట్​ ప్రక్రియ​ పూర్తయింది. బ్రెగ్జిట్​ గడువుకు(ఈ నెల 31) కొన్ని రోజుల ముందు ఈ ఒప్పందం జరిగింది.

ఒప్పందం పూర్తయిన అనంతరం.. "మేము బ్రెక్సిట్​ పూర్తి చేశాం, స్వతంత్ర వాణిజ్య దేశంగా లభించే అద్భుతమైన అవకాశాలను ఇప్పుడు పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటాం." అని బ్రిటన్​ ఓ ప్రకటనలో తెలిపింది.

"ఈయూతో సున్నా సుంకాలు, సున్నా కోటాల ఆధారంగా తొలి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడం ఓ అద్భుత పరిణామం. ఇది 668 బిలియన్​ పౌండ్లు విలువ చేసే అతిపెద్ద ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం" అని పేర్కొంది. బ్రిటన్​ తన డబ్బు, సరిహద్దులు, చట్టాలు, వాణిజ్యం, ఫిషింగ్​ వాటర్స్​పై తిరిగి నియంత్రణ సాధించింది అని పేర్కొంది.

పూర్తి స్వేచ్ఛ

ఈ ఒప్పందంతో బ్రిటన్​ ఇకపై ఈయూ పరిధి, నిబంధనలకు కట్టుబడి ఉండక్కర్లేదని స్పష్టం చేసింది. బ్రిటన్​ విషయంలో ఐరోపా కోర్ట్​ ఆఫ్​ జస్టిస్‌కు జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. సార్వభౌమాధికారంపై ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని పేర్కొంది బ్రిటన్​. 2021 జనవరి 1న మాకు పూర్తి రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం లభిస్తుందని​ ప్రకటించింది.

ఇదీ చూడండి:ప్రచండతో చైనా రాయబారి కీలక భేటీ

ABOUT THE AUTHOR

...view details