బ్రిటన్ ప్రధాని బోరిన్ జాన్సన్.. ఐరోపా సమాఖ్య(ఈయూ) అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లియెన్తో శనివారం సమావేశం కానున్నారు. ఈ మేరకు బ్రెగ్జిట్ అనంతర స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంపై తదుపరి చర్యలను చర్చించనున్నట్టు తెలుస్తోంది.
బ్రెగ్జిట్ గడువు ఈ ఏడాది చివర్లో ముగుస్తుండటం వల్ల.. ఇరువర్గాలు చర్చలకు సన్నద్ధమైనట్టు సమాచారం. ఈ మేరకు ఈయూతో వారం రోజుల పాటు పూర్తిస్థాయిలో చర్చించనుంది బ్రిటన్. గత జనవరిలో ఈయూ నుంచి వైదొలగిన యూకే.. వాణిజ్యం, సరిహద్దు అంశాల్లో స్వతంత్ర దేశంగా ఉంటోంది.