తెలంగాణ

telangana

ETV Bharat / international

బంగారు ధగధగలు.. ఖరీదైన నగల ప్రదర్శన - gold ornaments

టర్కీలోని ఇస్తాంబుల్​లో నిర్వహించిన జ్యువెలరీ షోలో ఖరీదైన నగలను ప్రదర్శించారు. నదీర్ మెటల్ రీఫైనరీ సంస్థ రూపొందించిన బంగారు నగ బాగా ఆకర్షించింది. దీని ఖరీదు ఐదు కోట్ల రూపాయలు.

టర్కీలో ఖరీదైన బంగారు నగల ప్రదర్శన

By

Published : Mar 26, 2019, 7:02 AM IST

టర్కీలో ఖరీదైన బంగారు నగల ప్రదర్శన
టర్కీలోని ఇస్తాంబుల్​లో బంగారు ఆభరణాల ప్రదర్శన అట్టహాసంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల నుంచి 30వేల మంది సందర్శకులు ఈ ప్రదర్శనకు హాజరయ్యారు. అక్టోబర్​లో వచ్చిన వారితో పోల్చుకుంటే ఈ సంఖ్య రెండింతలు. ఇక్కడి నగలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బంగారు ఆభరణాల్లో విభిన్న రకాలను ఈ షోలో ప్రదర్శించారు.

5కోట్ల బంగారు నగ..

నదీర్ మెటల్ రిఫైనరీ సంస్థ రూపొందించిన బంగారు ఆభరణంఅక్కడున్న వాటిలో అత్యంత ఖరీదైనది. దీని ధర 8లక్షల(రూ.5కోట్ల 5 లక్షలు) డాలర్లు. ఈ ఆభరణాన్ని అత్యధిక నాణ్యత గల బంగారంతో తయారు చేశారు. వీటిని ఫోర్​నైన్స్(999.9) నాణ్యత గల ఆభరణాలని పిలుస్తారు.

ఇక్కడ అత్యంత ఖరీదైన నగలు ఉన్నాయి. వీటి బరువు 12.5 కేజీలు. అన్నీ ఫోర్​నైన్స్ క్వాలిటీకి చెందినవి. విపణిలో వీటి ధర 6 లక్షల డాలర్లు(4కోట్ల 13 లక్షలు) ఉంటుంది. మొత్తం భాగం 8లక్షల డాలర్ల వరకు ఉంటుంది --కాన్ గోజూమ్, నదీమ్ మెటల్​ రిఫైనరీ ఎక్స్​పోర్ట్​ మేనేజర్

టర్కీలో లభించే బంగారు ఆభరణాలకు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులున్నారు. టర్కీష్​ సంప్రదాయ శైలీలో అటాసే జ్యువెలరీ డిజైనర్లు రూపొందించిన బ్యాక్​గామన్​ సెట్​ విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇది పురుషుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు.

మేము స్త్రీల కోసమే కాదు.. పురుషులకు నప్పే ఆభరణాలను కూడా తయారుచేస్తాం. వజ్రాలు పొదిగిన ఈ నగతో మగవాళ్లను ఆకర్షిస్తున్నాం. 100 క్యారెట్ల నాణ్యత గల వజ్రాలతో బ్యాక్​గామన్ సెట్​ను రూపొందించాం. ఈ మొత్తం సెట్ విలువ విపణిలో లక్షా 80వేల డాలర్ల(రూ.కోటి పైన) నుంచి2లక్షల డాలర్ల (రూ.కోటి 37లక్షలు)వరకు ఉంటుంది -- అటాసే కామెర్, అటాసే జ్యూవెలరీ సీఈఓ

బంగారం ఎగుమతుల్లో టర్కీ గత ఏడాది 35 శాతం వృద్ధిని సాధించింది. ముఖ్యంగా స్విట్జర్లాండ్, యూకే నుంచి ఎక్కవమంది కొనుగోలుదారులు టర్కీకి వస్తారు. తూర్పు మధ్య ఆసియా దేశాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్​లోనూ టర్కీ నగలకు మంచి గిరాకీ ఉంది.

ABOUT THE AUTHOR

...view details