జర్మనీ వోక్మార్సెన్ నగరంలో సోమవారం కార్నివాల్ జరుగుతుండగా అకస్మాత్తుగా ఓ కారు ప్రజలపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 30 మందికిపైగా ప్రజలు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో చిన్న పిల్లలూ ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు కారణమైన కారు డ్రైవర్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని స్పష్టం చేశారు.
క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అందించటం కోసం వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.