తెలంగాణ

telangana

By

Published : Jun 10, 2021, 7:01 AM IST

ETV Bharat / international

ఆ రకం వైరస్​తో మూడో దశ ముప్పు!

డెల్టా రకం వైరస్‌ తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే.. బ్రిటన్‌లో మూడో దశ వైరస్‌ విజృంభణకు అవకాశాలు కనిపిస్తున్నాయని లండన్‌ ఇంపీరియల్‌ కళాశాలకు చెందిన ప్రొఫెసర్‌ నీల్‌ ఫెర్గూసన్‌ హెచ్చరించారు. అయితే.. మూడోదశ తీవ్రత రెండో దాని కన్నా అధికంగా ఉంటుందా? తక్కువగా ఉంటుందా? అన్నది ఇప్పుడే అంచనా వేయలేమని పేర్కొన్నారు.

third wave corona in britan
బ్రిటన్​లో మూడో దశ కరోనా వ్యాప్తి

ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా కేసులు, డెల్టా వైరస్‌ తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే బ్రిటన్‌లో మూడో విడత వైరస్‌ విజృంభణకు అవకాశాలు కనిపిస్తున్నాయని లండన్‌ ఇంపీరియల్‌ కళాశాలకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు ప్రొఫెసర్‌ నీల్‌ ఫెర్గూసన్‌ హెచ్చరించారు. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి రేటు 1.5 నుంచి 1.6గా ఉందని, దీని ప్రకారం ప్రతి 10 మంది నుంచి వైరస్‌ 15 లేదా 16 మందికి సంక్రమిస్తుందని తెలిపారు.

డెల్టా రకం వైరస్‌ ప్రబలంగా ఉన్నందున తాజా నమూనాలు మూడో ఉద్ధృతిని చూస్తున్నాయి. అయితే, మూడో విడత తీవ్రత రెండో దాని కన్నా అధికంగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా అన్నది ఇప్పుడే అంచనా వేయలేం. టీకాలు ఎంత బాగా రక్షణ కల్పించగలవు అన్నది కూడా కీలకాంశమే. అన్‌లాక్‌ ప్రక్రియను మరికొంత కాలం వాయిదా వేయడం, టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయడం ద్వారా మూడో ఉద్ధృతి ప్రారంభాన్ని జాప్యం చేయవచ్చు.

-నీల్​ ఫెర్గూసన్​, అంటువ్యాధుల నిపుణుడు

ఇప్పటికే కరోనా బారినపడి కోలుకున్న వారిలో, టీకాలు వేయించుకున్న వారిలో ప్రతిరక్షకాలు(యాంటీబాడీలు) సిద్ధంగా ఉంటాయి కనుక వైరస్‌ తీవ్రత తగ్గవచ్చని ఫెర్గూసన్ అభిప్రాయపడ్డారు.

బ్రిటన్‌లో బుధవారం కొత్తగా 7,560 కరోనా కేసులు నమోదయ్యాయి. గత ఫిబ్రవరి చివరిలో నమోదైన కేసుల కన్నా ఈ సంఖ్య అధికం.

ఇదీ చూడండి:92 దేశాలకు 50 కోట్ల టీకా డోసులు: అమెరికా

ఇదీ చూడండి:అమ్మ కోసం చిన్నారి ఆరేళ్ల నిరీక్షణ- చివరకు కలిసిందిలా

ABOUT THE AUTHOR

...view details