భావ ప్రకటన స్వేచ్ఛ, శాంతియుతంగా నిరసన తెలపడం, సమావేశం కావడం మొదలైనవి నిర్వివాదాంశమైన మానవ హక్కులని స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ పేర్కొన్నారు. ఇవి ఏ ప్రజాస్వామ్యంలోనైనా ముఖ్యమైన భాగాలుగా ఉండాలన్నారు.
'శాంతియుత నిరసన నిర్వివాదాంశమైన హక్కు' - right to peaceful protest non negotiable
'టూల్‌కిట్' వ్యవహారంలో దిశ రవి అరెస్టుపై స్పందించారు పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్. శాంతియుతంగా నిరసన తెలపడం నిర్వివాదాంశమైన మానవ హక్కుగా పేర్కొన్నారు.
శాంతియుత నిరసన.. నిర్వివాదాంశమైన హక్కు: గ్రెటా
'టూల్‌కిట్'వ్యవహారంలో పర్యావరణ కార్యకర్త దిశరవిని ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు గ్రెటా. అయితే... దిశ రవితో పాటు మరో ఇద్దరు అరెస్టుకు కారణమైన 'టూల్‌కిట్'ను ట్విట్టర్లో పోస్ట్ చేసింది గ్రెటాయే. ఈ నేఫథ్యంలో దిశ రవికి మద్దతుగా గ్రెటా తొలిసారి స్పందిస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:ఆ విషయంలో భారత్ మద్దతు కోరిన శ్రీలంక