దాదాపు 20 వేల మంది ఔత్సహికులతో స్పెయిన్లో వార్షిక టమాటీనా వేడుకలు సందడిగా సాగాయి. టమాటీనా అంటే టమాటా యుద్ధం అని అర్థం. ఈ సరదా వేడుకలో పాల్గొనేందుకు విదేశాల నుంచి పర్యటకులు తరలివస్తుంటారు. టన్నుల కొద్ది టొమాటాలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. నుజ్జు నుజ్జు అయిన టమాటాల్లో మునిగి తేలుతూ రోజంతా ఆనందంగా గడిపారు.
స్పెయిన్: టమాటాలతో సరదా యుద్ధం - స్పెయిన్
స్పెయిన్లో టమాటీనా ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ఇంతకీ టమాటీనా ఏంటనీ అనుకుంటున్నారా? ఇది ఓ రకమైన సరదా ఆట. ఇందులో ఒకరిపైఒకరు టమాటాల్ని విసురుకుంటారు. ఏటా స్పెయిన్లో ఇదో ఉత్సవంలా సాగుతుంది.
ఈ సరదా యుద్ధం కోసం 145 టన్నుల టమాటాలను ఉపయోగించారు. ఆ గుజ్జును ఒకరిపై ఒకరు విసురుకుంటూ గడిపారు. ఈ టమాటో ఫైట్‌లో దాదాపు 20 వేల మంది పాల్గొన్నారు. మిగతా క్రీడలాగే ఈ టమాటీనాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. పచ్చి టమాటాలను వాడకూడదు. ఎదుటి వ్యక్తిపైకి విసిరేటప్పుడు దెబ్బ తగలకుండా టమాటోను పిండిచేయాలి. రోడ్డుపై వచ్చే వాహనాలకు దారి ఇవ్వాలి.టమాటా ఉత్పత్తి చేసే ప్రాంతంలో1945లో ఆహారం కోసం స్థానిక పిల్లల మధ్య జరిగిన ఘర్షణ నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఇదీ చూడండి : కాకి పగబట్టిందా? అందుకే దాడి చేస్తోందా?