తెలంగాణ

telangana

ETV Bharat / international

అంతరించిపోతున్న కళకు జీవం ఈ తోలుబొమ్మల ఉత్సవం

తోలుబొమ్మలాట అంటే తెలియని వారుండరూ. కానీ సినిమాలు వచ్చిన అనంతరం నెమ్మదిగా ఈ కళ అంతరించిపోతోంది. వీటితో ప్రదర్శన చేసే వారు కాదు కదా..చూసే వారూ తక్కువే. కానీ స్పేయిన్​ దేశంలోని సేగోవియా నగరంలో ఇప్పటికీ తోలుబొమ్మలే ప్రధాన ఆకర్షణ. ఈ నగరంలో తోలుబొమ్మల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆ సంగతేంటో తెలుసుకుందామా మరీ...

స్పేయిన్​లో తోలుబొమ్మల ప్రదర్శన అదుర్స్​

By

Published : May 18, 2019, 7:03 AM IST

స్పేయిన్​ సేగోవియాలో తోలుబొమ్మల కళకు జీవం

స్పేయిన్​లోని సేగోవియా నగరంలో 'టిటిరిముండి అంతర్జాతీయ తోలుబొమ్మ థియేటర్' 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. థియేటర్​లోనే కాదు నగర వీధుల్లోనూ ఈ తోలుబొమ్మల ప్రదర్శనలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వీటిలో కీలుబొమ్మలు, చేతితో ఆడించే బొమ్మలు ఎంతో ప్రత్యేకం.

ఈ ఉత్సవాల్లో పిల్లలే ప్రధాన ఆకర్షన. సుమారు 3 వేల మంది చిన్నారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. స్వయంగా తోలుబొమ్మలు తయారు చేయాలనుకునే పిల్లలను 'టిటిరికోల్​ తోలుబొమ్మల కేంద్రం' ప్రోత్సహించి శిక్షణ అందిస్తుంది. వివిధ రకాల బొమ్మలతో చిన్నారులు చేసిన ప్రదర్శనకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు.

" మొదట్లో టిటిరిముండి ఉత్సవాలకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. వీధుల్లోనే ప్రజలు ప్రదర్శనలు చూడటానికి ఇష్టపడేవారు. కానీ చిన్న చిన్నగా మొత్తం నగరం ఉత్సవాల్లో భాగమవుతోంది. మేము ఎన్నో పాఠశాలలు, విద్యాసంస్థలకు తిరిగి ప్రచారాలు చేశాం. చిన్నారులు ఈ ఉత్సవాలకు వచ్చారు. బోధన పరికరంగా ఈ బొమ్మలను ఉపయోగించాం. తోలుబొమ్మలతో చిన్నారులను ఈ అధునాతన ప్రపంచానికి దూరంగా తీసుకెళ్తాం. మరి ఐపాడ్​, ఐఫోన్లే జీవితం కాదు కదా!" - మారియన్​ పాల్మా, నిర్వాహాకురాలు.​

ఈ ఉత్సవాలను మొదటి సారి 1985లో నిర్వహించారు. నృత్యకారులు, నటులు, తోలుబొమ్మల ఆటగాళ్లు ఈ బొమ్మల సంప్రదాయాన్ని కాపాడుతున్నారు. బొమ్మలను తమ నృత్యాల్లో భాగం చేసి కొత్త కొత్త స్టెప్పులు ఆవిష్కరిస్తున్నారు. నృత్యాలు నేర్చుకునే వారికి ఈ కొత్త విధానంలోనే శిక్షణ ఇస్తున్నారు.

ఈ ఉత్సవాలు మే 19 వరకు జరుగుతాయి. 16 దేశాల నుంచి 36 బృందాలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నాయి.

ఇదీ చూడండి:కళ్లుజిగేలుమనేలా 'ఆసియా కల్చరల్​' కార్నివాల్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details