తెలంగాణ

telangana

ETV Bharat / international

రికార్డు సృష్టించాలనుకుని తిరిగిరాని లోకాలకు..! - అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు

ఇటలీ సముద్ర తీరంలో కొందరు పడవలో వేగంగా వెళ్లి రికార్డు సృష్టించాలనుకున్నారు. ప్రమాదవశాత్తు పడవ అదుపుతప్పి ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

రికార్డు సృష్టించాలనుకుని తిరిగిరాని లోకాలకు..!

By

Published : Sep 18, 2019, 6:12 PM IST

Updated : Oct 1, 2019, 2:20 AM IST

రికార్డు సృష్టించాలనుకుని తిరిగిరాని లోకాలకు..!

ఇటలీలోని వెనిస్​ నగర సముద్ర తీర ప్రాంతంలో ఓ స్పీడు బోటు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్పీడ్​ బోట్​ రేస్​లో భాగంగా... అత్యంత వేగంతో వెళ్లి రికార్డు నెలకొల్పడానికి ప్రయత్నించే క్రమంలో ఘోరం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మొనాకో మధ్యదరా ఓడరేవు మాంటే కార్లో నుంచి వెనిస్​ వెళ్లే మార్గంలో ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది.

ఇదీ చూడండి:అమెరికాలో ప్రతి నలుగురు ప్రవాసీల్లో ఒకరు భారతీయుడే!

Last Updated : Oct 1, 2019, 2:20 AM IST

ABOUT THE AUTHOR

...view details