తెలంగాణ

telangana

ETV Bharat / international

'త్వరలోనే.. థెరిసా మే రాజీనామా!'

బ్రిటన్​ ప్రధాని థెరిసా మే పదవి నుంచి వైదొలగాలని స్వపక్షంచే ఒత్తిడి పెరుగుతోంది. త్వరలోనే ఆమె రాజీనామా తేదీ ప్రకటిస్తారని టోరీ ఎంపీ గ్రాహమ్ బ్రాడీ తెలిపారు.

'థెరిసా మే.. త్వరలోనే రాజీనామా!'

By

Published : May 12, 2019, 5:53 AM IST

Updated : May 12, 2019, 7:23 AM IST

'థెరిసా మే.. త్వరలోనే రాజీనామా!'

బ్రిటన్ ప్రధాని థెరిసా మే త్వరలోనే తన రాజీనామా తేదీని ప్రకటిస్తారని కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ గ్రాహమ్​ బ్రాడీ వెల్లడించారు. అనంతరం భవిష్యత్​ ప్రధాని కోసం మార్గనిర్దేశం చేస్తారని ఆయన స్పష్టం చేశారు.

బ్రెగ్జిట్ సమస్య పరిష్కారం కాగానే రాజీనామా సమర్పిస్తానని మార్చి నెలలో థెరిసా మే ప్రకటించారు. కానీ అంతకుముందే రాజీనామా చేయాలనిస్వపక్షం నుంచి ఆమెపై ఒత్తిడి పెరుగుతోంది.

కన్జర్వేటివ్​ పార్టీకి చెందిన '1922 కమిటీ'కి అధ్యక్షుడైన గ్రాహమ్ బ్రాడీ ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. థెరిసా మే తన భవిష్యత్​ ప్రణాళికలపై స్పష్టత ఇవ్వాలని కమిటీ కోరిందని, కమిటీ ముందు బుధవారం హాజరైన తరువాత ఆమె రాజీనామా విషయంలో స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు.

"ప్రధానమంత్రిగా లేదా కన్జర్వేటివ్​ పార్టీ నేతగా శాశ్వతంగా ఉండాలని థెరిసా మే కోరుకుంటున్నట్లు నేను భావించడం లేదు." - గ్రాహం బ్రాడీ, టోరీ ఎంపీ, కన్జర్వేటివ్​ పార్టీ నేత

ఓటమి తప్పించుకోవడానికే..

ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో థెరిసా మే నేతృత్వంలోని కన్జర్వేటివ్​ పార్టీకి ఓటర్ల నుంచి తిరస్కారం ఎదురైంది. ఈ నెల 23న జరిగే యూరోపియన్​ పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే ఫలితం రావచ్చని ఆ పార్టీ భయపడుతోంది. అందుకే ప్రధాని పదవి నుంచి థెరిసా మేని వైదొలగాలని విజ్ఞప్తి చేస్తోంది.

బ్రెగ్జిట్​ దెబ్బ

ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగే గడువు (బ్రెగ్జిట్​) మార్చి 29 నుంచి అక్టోబర్​ 31కి పొడిగించారు. అయితే థెరిసా మే బ్రెగ్జిట్ ఒప్పందాన్ని బ్రిటన్​ పార్లమెంట్ ఇప్పటికే పలుమార్లు తిరస్కరించింది.

ఇదీ చూడండి: 'ఫోబియా'కు స్పైడర్​మ్యాన్​ 'ట్రీట్​మెంట్​'

Last Updated : May 12, 2019, 7:23 AM IST

ABOUT THE AUTHOR

...view details