తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రిటన్​ రక్షణ మంత్రిపై థెరిసా వేటు - London

బ్రిటన్​ రక్షణ శాఖ మంత్రి గవిన్​ విలియమ్సన్​కు ప్రధాని థెరిసా మే షాకిచ్చారు. జాతీయ భద్రతా మండలి సమావేశం సమచారాన్ని బహిర్గతం చేసినందుకు పదవి నుంచి తొలగించారు. నూతన రక్షణ మంత్రిగా పెన్ని మొర్దంట్​ను నియమించారు.

బ్రిటన్​ రక్షణ మంత్రిపై థెరిసా వేటు

By

Published : May 2, 2019, 10:00 AM IST

బ్రిటన్​ అధికార పక్షంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశంలో 5జీ నెట్​వర్క్​ అభివృద్ధి కోసం చైనా సంస్థ హువావేకు అధికారిక అనుమతులిచ్చారనే సమాచారాన్ని బహిర్గతం చేసినందుకు రక్షణ మంత్రి గవిన్​ విలియమ్సన్​పై వేటువేశారు ఆ దేశ ప్రధాని థెరిసా మే. విచారణ జరిపిన అనంతరం విలియమ్సన్​ను పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ భద్రతా మండలి సమావేశం నుంచే సమాచారం లీకైనట్లు తెలిపారు.

రక్షణ మంత్రిపై ప్రధాని విశ్వాసం కోల్పోయినట్లు డౌనింగ్​ స్ట్రీట్​ పేర్కొంది.
2017 నుంచి విలియమ్సన్​ రక్షణశాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. ఆయన స్థానంలో పెన్ని మొర్దంట్​ను నియమించారు ప్రధాని మే.

ఇదీ చూడండి:రాహుల్​గాంధీకి ఈసీ 'షోకాజ్​' నోటీసులు

ABOUT THE AUTHOR

...view details