తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనాకు పూర్తి స్థాయి పరిష్కారం కష్టమే: డబ్ల్యూహెచ్​ఓ - tedros on corona vaccine

కరోనా వైరస్​ను నిలువరించటం ఇప్పుడిప్పుడే సాధ్యం కాదని డబ్ల్యూహెచ్​ఓ చీఫ్ టెడ్రోస్ అథనోమ్​ అభిప్రాయపడ్డారు. చాలా వాక్సిన్లు మూడో దశ ప్రయోగాల్లో ఉన్నాయని.. అవి ప్రజలను ఇన్ఫెక్షన్​ నుంచి కాపాడుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

WHO
డబ్ల్యూహెచ్​ఓ చీఫ్ టెడ్రోస్ అథనోమ్​

By

Published : Aug 3, 2020, 5:36 PM IST

కరోనా మహమ్మారికి ప్రస్తుతానికి పూర్తి స్థాయి పరిష్కారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సారథి టెడ్రోస్ అథనోమ్​ స్పష్టం చేశారు. ఎప్పుడు లభిస్తుందో కూడా కచ్చితంగా చెప్పలేమన్నారు. అయితే చాలా వ్యాక్సిన్లు మూడో దశ ప్రయోగాల్లో ఉన్నట్లు తెలిపారు టెడ్రోస్​. ఇవి ప్రభావవంతంగా పనిచేస్తాయని భావిస్తు్న్నట్లు చెప్పారు.

కరోనా వైరస్​ విపత్తుపై అత్యవసర కమిటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి 3 నెలల కాలంలో 5 రెట్లకుపైగా కేసులు నమోదయ్యాయని టెడ్రోస్ తెలిపారు. మరణాల సంఖ్య మూడు రెట్లు పెరిగి 6.8 లక్షలకు చేరిందని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details