ఇంగ్లాండ్, వేల్స్‌లో శ్వేత జాతీయులతో పోలిస్తే..50 నుంచి 70 శాతం అధికంగా భారత సంతతి ప్రజలే కొవిడ్ కారణంగా మరణించే అవకాశాలు ఉన్నాయని లండన్‌లో జాతీయ గణాంకాల కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ అంతరానికి నివాస పరిస్థితులు, ఉద్యోగ స్వభావమే కారణమని విశ్లేషించింది.
"నల్ల, దక్షిణాసియా జాతుల్లో 28 జులై వరకు మరణాలను లెక్కలోకి తీసుకున్నాం. శ్వేతజాతీయులతో పోలిస్తే.. వీళ్లలో మరణాలు సంభవించే అవకాశం అధికంగా ఉన్నట్లు తేలింది. గతంలో మే 15 వరకు చేశాం. అప్పుడెలాంటి ఫలితాలు వచ్చాయో ఇప్పుడూ అదే ఫలితాలు వచ్చాయి. "