Russia Weapons Ukraine: ఉక్రెయిన్‌ను మూడువైపులా చుట్టుముట్టి విరుచుకుపడుతోంది రష్యా. పదులకొద్దీ సైనిక స్థావరాలు సహా పలు నగరాలపైనా దాడులు చేసింది. రాజధాని నగరం కీవ్ ఆక్రమణే లక్ష్యంగా.. రష్యా సైన్యం క్షిపణి దాడులు చేపడుతోంది. షెల్లింగ్‌లు ప్రయోగిస్తోంది. అయితే.. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా వాడుతున్న ఆయుధాలు ఏంటో తెలుసుకుందామా..?
శతఘ్నులు.. క్షిపణులు..
ఉక్రెయిన్ సరిహద్దుల సమీపంలోనే అసెంబ్లింగ్ చేసిన స్వల్ప, మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, క్రూజ్ క్షిపణులు, శక్తిమంతమై శతఘ్నులు వినియోగించి ప్రభుత్వ భవనాల వంటి వాటిని లక్ష్యంగా చేసుకొన్నాయి. రష్యా దళాలు మొత్తం 160 క్షిపణులను ఉక్రెయిన్‌లోని లక్ష్యాలపై ప్రయోగించాయి. వీటిల్లో కల్బిర్ క్రూజ్ క్షిపణులు, సికిందర్ టాక్టికల్ బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. దీంతోపాటు క్రూజ్ క్షిపణులు, సముద్రంపై నుంచి దాడి చేసే క్షిపణలు, విమానాలపై నుంచి ప్రయోగించే క్షిపణులను వినియోగించినట్లు అమెరికా రక్షణ శాఖ వర్గాలు అంచనా వేశాయి. దీంతోపాటు స్మెర్చ్ రాకెట్ లాంఛర్లను కూడా వాడినట్లు ఉక్రెయిన్‌లో దొరికిన శకలాలు చెబుతున్నాయి. ఒక ట్రక్‌పై నుంచి 38 క్షణాల్లో 12 రౌండ్ల స్మెర్చిలను పేల్చగలదు. కాకపోతే వీటిపై లక్ష్యాలను కచ్చితంగా ఛేదించే గైడెడ్ వ్యవస్థ ఉండదు. వీటితోపాటు ఉర్గాన్ మల్టీ రాకెట్ లాంచర్లను కూడా వినియోగించినట్లు భావిస్తున్నారు.
75 విమానాలు వాడి..