కరోనా వైరస్ తోకముడిచినట్లే ముడిచి, మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఐరోపా ఖండంలోని పలు దేశాలు మరోసారి వైరస్(Europe Covid Cases) కోరల్లో చిక్కుకున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)(Who Coronavirus Cases) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఏడాది ప్రారంభం నాటికి మరో 5 లక్షల మరణాలు(Europe Covid Cases) సంభవించొచ్చని అంచనా వేసింది.
"ఐరోపా ఖండంలోని దేశాల్లో ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇదే తీరుగా వైరస్ ఉద్ధృతి కొనసాగితే వచ్చే ఫిబ్రవరి నాటికి మరో ఐదు లక్షల కొవిడ్ మరణాలు సంభవిస్తాయని ఒక అంచనా."
-హన్స్ క్లూగే, డబ్ల్యూహెచ్ఓ ఐరోపా విభాగం డైరెక్టర్.