తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా విలయ తాండవం- ఒక్కరోజే 2 వేలకుపైగా మరణాలు - corona latest news

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. మృతులు రోజురోజుకు పెరుగుతున్నారే కాని తగ్గడం లేదు. ఇప్పటివరకు అన్ని దేశాల్లో కలిపి 21వేల మందికి పైగా మరణించగా.. ఇటలీలో అత్యధికంగా 7,500కు పైగా మరణాలు సంభవించాయి.

claimed over 21,000 lives
కరోనా విలయతాండవం

By

Published : Mar 26, 2020, 12:46 PM IST

ప్రపంచ దేశాలపై కరోనా పంజా విసురుతోంది. మహమ్మారి ధాటికి అగ్రరాజ్యాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 4,68,905 మందికి వైరస్​ సోకింది. 21, 200మంది మృతి చెందారు. కరోనా బారిన పడ్డవారిలో లక్షా 14వేల మంది కోలుకున్నారు. అందులో ఎక్కువ మంది చైనాకు చెందిన వారే కావడం గమనార్హం.

కరోనా విలయతాండవం

ఇటలీలో మరో 683మంది మృతి..

కరోనా విజృంభనతో ఇటలీ వణికిపోతోంది. రోజురోజుకు పెరిగిపోతున్న మరణాలు ఆ దేశ ప్రభుత్వాన్ని, పౌరులను మరింత కలవరపెడుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 683మంది మృతి చెందారు. రెండు వారాలుగా అక్కడ లాక్​డౌన్​ కొనసాగుతోంది.

స్పెయిన్​లో 738 మరణాలు..

స్పెయిన్​లోనూ కరోనా విలయతాండవం చేస్తోంది. బుధవారం ఒక్కరోజే 738 మంది మరణించారంటే ఆ దేశంలో వైరస్​ తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

చైనాలో నమోదు కాని కొత్త కేసులు

చైనాలో దేశీయంగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే విదేశాల నుంచి వచ్చిన మరో 67మందికి వైరస్​ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య వర్గాలు తెలిపాయి. తాజాగా హుబెకు చెందిన మరో ఆరుగురు మృతి చెందారు.

ABOUT THE AUTHOR

...view details