తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​కు డబ్ల్యూహెచ్​ఓ చీఫ్ ధన్యవాదాలు - international news latest

కరోనా ఉత్పత్తులపై మేధో హక్కులను రద్దు చేసేందుకు చొరవ తీసుకుంటున్న భారత్​, దక్షిణాఫ్రికాకు డబ్ల్యూహెచ్​ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ టీకా అందించాలంటే వ్యాక్సిన్ల ఉత్పత్తిని భారీగా పెంచడం అత్యావశ్యకం అన్నారు.

who chief
భారత్​కు డబ్ల్యూహెచ్​ఓ చీఫ్ ధన్యవాదాలు

By

Published : May 25, 2021, 9:59 AM IST

భారత్​, దక్షిణాఫ్రికాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్​ జనరల్​ టెడ్రోస్ అధనోమ్ ధన్యవాదాలు తెలిపారు. కరోనా ఉత్పత్తులపై మేధో సంపత్తి హక్కులను తాత్కాలికంగా రద్దు చేయాలని ప్రతిపాదించినందుకు ఈ రెండు దేశాలను కొనియాడారు. దీనికి మద్దతు తెలిపిన ఇతర దేశాలనూ ప్రశంసించారు.

కరోనా టీకాలను పేద, మధ్య తరగతి దేశాలకు అందించాలంటే వ్యాక్సిన్​ను ఉత్పత్తి చేసే దేశాలు కొవాక్స్​కు భారీ సంఖ్యలో సమకూర్చాలని టెడ్రోస్ అన్నారు. సోమవారం ప్రపంచ ఆరోగ్య సదస్సులో మాట్లాడిన ఆయన.. కరోనా టీకాలు వేగంగా, అధిక సంఖ్యలో ఉత్పత్తి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించాలని నొక్కి చెప్పారు. సాంకేతికతను షేర్ చేసి అనుమతులిస్తే టీకాలను ఉత్పత్తి చేసేందుకు తాము సిద్ధమని కొన్ని సంస్థలు ప్రకటించినా.. ఆ దిశగా ప్రయత్నాలు ఇంకా జరగకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న వ్యాక్సిన్ సంక్షోభాన్ని 'అపకీర్తి అసమానతలు'గా ఆయన అభివర్ణించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన మొత్తం వ్యాక్సిన్లలో 75శాతానికిపైగా ధనిక దేశాలకే పరిమితమయ్యాయని టెడ్రోస్​ చెప్పారు. వాటిని సమానంగా పంపణీ చేసి ఉంటే ప్రపంచంలోని మొత్తం ఆరోగ్య సిబ్బంది, వృద్ధులకు ఈ పాటికే టీకా లభించేదన్నారు.

సెప్టెంబరు నాటికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో కనీసం 10 శాతం మందికి టీకా అందేలా చూడాలని అధనోమ్​ చెప్పారు.

కరోనా టీకాలపై మేధో హక్కులను రద్దు చేయాలని భారత్ తొలుత ప్రతిపాదించింది. ఆ తర్వాత దక్షిణాప్రికా మద్దతుగా నిలిచింది. అమెరికా కూడా దీనిపై సానుకూలంగా స్పందించింది.

ఇదీ చూడండి:కరోనా పుట్టుకపై ఫౌచీ అనుమానాలు

ABOUT THE AUTHOR

...view details