వచ్చే వేసవి నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారిని అరికట్టే 10 వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయ ఔషధ తయారీ సంస్థల సమాఖ్య(ఐఎఫ్‌పిఎంఏ) వెల్లడించింది. ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా నుంచి ఇప్పటికే మంచి ఫలితాలు వెలువడ్డాయని తెలిపింది. అయితే, టీకాను వేగంగా తీసుకురావాలన్న తొందరలో భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఐఎఫ్‌పిఎంఏ డైరెక్టర్ జనరల్ థామస్ క్వెనీ స్పష్టం చేశారు.
ఈ వేసవికి సిద్ధంకానున్న 10 వ్యాక్సిన్లు - oxford vaccine update
కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో పలు కంపెనీలు చాలా ముందున్నాయి. వచ్చే వేసవికాలం నాటికి సుమారు పది టీకాలు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నట్లు అంతర్జాతీయ ఔషధ తయారీ సంస్థల సమాఖ్య(ఐఎఫ్‌పీఎంఏ) తెలిపింది. ఇప్పటికే ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా టీకాలు వైరస్‌పై పోరాడటంలో ముందున్నాయని స్పష్టం చేసింది.
ఈ వేసవికి సిద్ధంకానున్న 10 వ్యాక్సిన్లు
జాన్సన్ అండ్ జాన్సన్, నోవావాక్స్, సనోఫీ పాశ్చర్, మెర్క్, జీఎస్కే నుంచి కూడా త్వరలోనే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని క్వెనీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఔషధ తయారీ, బయోటెక్ సంస్థలు కరోనా టీకాపై పరిశోధనలకు భారీగా వెచ్చించాయని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాయన్నారు.