తెలంగాణ

telangana

ETV Bharat / international

విమానంలో 19 ఏళ్ల యువతి ప్రపంచ యాత్ర.. ఒంటరిగా! - విమానంలో

ఒంటరిగా ప్రపంచ యాత్ర చేపట్టేందుకు ఓ 19 ఏళ్ల యువతి సాహసానికి పూనుకుంది. అతిపిన్న వయసులో ఈ ఘనత సాధించిన మహిళగా నిలవడమే లక్ష్యంగా ఈ యాత్ర చేపట్టింది. ఒకే సీటున్న విమానంలో ఐదు ఖండాలు, 52 దేశాలను చుట్టిరానుంది.

zara-rutherford
జారా రూథర్‌ఫోర్డ్‌

By

Published : Aug 19, 2021, 8:25 AM IST

అతి పిన్న వయసులోనే విమానంలో ప్రపంచాన్ని చుట్టేసిన మహిళగా రికార్డు సృష్టించడానికి 19 ఏళ్ల యువతి సాహసానికి పూనుకుంది. ఒకే సీటున్న లోహ విహంగంలో గాల్లోకి ఎగిరింది. ఈదురుగాలులు, మేఘావృతమైన ఆకాశంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నా వెరవక, తల్లిదండ్రులు వీడ్కోలు పలుకుతుండగా బుధవారం ప్రయాణాన్ని ప్రారంభించింది.

బెల్జియంలోని కొర్ట్రిజ్క్‌లో ఓ చిన్న విమాన స్థావరం నుంచి నింగికి ఎగిరిన ఆమె పేరు జారా రూథర్‌ఫోర్డ్‌. బెల్జియన్‌-బ్రిటిష్‌ యువతి అయిన జారా రెండు-మూడు నెలల ప్రయాణంలో ఐదు ఖండాలు, 52 దేశాల మీదుగా తన యాత్ర కొనసాగించనుంది. ఇందుకు తన షార్క్‌ స్పోర్ట్‌ మోడల్‌ విమానాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేసుకుంది.

అతి తక్కువ వయసులో విమానంలో ప్రపంచాన్ని చుట్టేసిన మహిళగా అమెరికాకు చెందిన షాయెస్టా వయిజ్‌ పేరిట రికార్డు ఉంది. 30 ఏళ్ల వయసులో ఆమె ఆ ఘనత సాధించింది. దాన్ని బద్దలుకొట్టాలని జారా లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదీ చూడండి:76 రోజులు.. ఒంటరిగా 4వేల కి.మీ సముద్రయానం

ABOUT THE AUTHOR

...view details