అఫ్గానిస్థాన్‌లో(Afghan Crisis) తాలిబన్ల దురాక్రమణ(Afghanistan Taliban).. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగతా ఉగ్రవాదులకు(Terrorist Groups) ప్రేరణ కలిగించవచ్చని బ్రిటన్ నిఘా సంస్థ అధిపతి తెలిపారు. ఉగ్రవాదులు మళ్లీ 9/11 తరహా దాడులకు(9/11 Attacks) పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఉగ్రముప్పును(Terror Threat) ఎదుర్కోవడానికి అప్రమత్తంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. అమెరికాలో అల్-ఖైదా ఉగ్రసంస్థ జరిపిన మారణహోమానికి 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో 'బీబీసీ'తో బ్రిటన్ ఎంఐ5 నిఘా సంస్థ డైరెక్టర్ జనరల్ కేమ్ మెక్కల్లమ్ మాట్లాడారు.
"అఫ్గానిస్థాన్‌లోని పరిణామాలను ఉగ్రవాదులు స్ఫూర్తిగా తీసుకునే ప్రమాదం పొంచి ఉంది. వాళ్లు పునరుజ్జీవం చెంది.. అత్యాధునిక మార్గాల్లో 9/11 వంటి దాడులకు పాల్పడే ప్రమాదం ఉంది. అఫ్గాన్ పరిణామాలు.. రాత్రికి రాత్రే బ్రిటన్ లేదా ఇతర దేశాల్లో అల్-ఖైదా వంటి ఉగ్రసంస్థలకు నైతిక బలాన్ని కలిగించవచ్చు. అందుకే మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది."
-మెక్కల్లమ్, బ్రిటన్ ఎంఐ5 డైరెక్టర్ జనరల్.