ఈ ఏడాది జపాన్, జర్మనీ, ఇటలీకి చెందిన ముగ్గురు ప్రముఖ శాస్త్రవేత్తలకు.. భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కింది. భూ వాతావరణానికి సంబంధించిన భౌతిక నమునాలు, వైవిధ్యాల లెక్కింపు, విశ్వసనీయమైన గ్లోబల్ వార్మింగ్ అంచనాలకుగాను జపాన్‌కు చెందిన సుకురో మనాబేకు, జర్మనీకి చెందిన క్లౌస్ హసిల్‌మన్‌కు ఈ పురస్కారం దక్కింది. పరిమాణువు నుంచి గ్రహాలప్రమాణాల వరకు భౌతిక వ్యవస్థలో అసమానతలు, మార్పులకు సంబంధించిన పరస్పర చర్యలను కనుగొన్నందుకు ఇటలీకి చెందిన జార్జో పరిసికి నోబెల్ అవార్డ్ దక్కినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. భూ వాతావరణ విజ్ఞానం, అది మానవాళిని ఎలా ప్రభావితం చేస్తుందో మనాబే, హసిల్‌మన్‌లు.. తమ పరిశోధనల ద్వారా పునాది వేశారని రాయల్ స్వీడిష్ అకాడమీ తెలిపింది.
1960 నుంచి భూ వాతావరణంపై పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు.. ప్రపంచ ఉష్ణోగ్రతలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో సుకురో మనాబే నిరూపించారు. ప్రస్తుత వాతావరణ నమూనాలకు.. ఆయన పరిశోధనలు ఆధారం కానున్నాయి. వాతావరణం, వాతావరణాన్ని అనుసంధానించే ఒక నమూనాను క్లౌస్ హసిల్‌మన్ దాదాపు దశాబ్దం క్రితం సృష్టించారు. వాతావరణం అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ.. వాతావరణ నమూనాలు ఎందుకు విశ్వసనీయంగా ఉంటాయో వివరించడానికి ఉపయోగపడుతాయి. వాతావరణాన్ని మానవాళి ప్రభావితం చేసే నిర్ధిష్టమైన సంకేతాలను హసిల్‌మన్ అభివృద్ధి చేశారు. గణితం, జీవశాస్త్రం, న్యూరో సైన్స్, యంత్ర అభ్యాసంలో సంక్లిష్ట విధానాన్ని అర్థం చేసుకోవటానికి.. లోతైన భౌతిక, గణిత నమూనాలను జార్జో పరిసి రూపొందించారు. ఈ అవార్డ్ కింద బంగారు పతకం, 11లక్షల డాలర్ల నగదు పురస్కారం అందజేయనున్నారు. నగదు పురస్కారంలో సగం సుకురో మనాబే, క్లౌస్ హసిల్‌మన్‌కు, మిగితా సగం జార్జో పరిసికి పంచనున్నారు.