తెలంగాణ

telangana

ETV Bharat / international

స్విట్జర్లాండ్‌లో ఇక 'బుర్ఖా' ధరిస్తే నేరమే! - swiss government against burqa

బహిరంగ ప్రదేశాల్లో వేసుకొనే బుర్ఖా నిషేధంపై స్విట్జర్లాండ్‌లో రెఫరెండం జరిగింది. ఈ తీర్మానానికి అనుకూలంగా మెజార్టీ ఓటర్లు స్పందించారు. దీంతో బుర్ఖా ధరించడం ఇకపై అక్కడ నేరంగా పరిగణించనున్నారు.

Swiss narrowly back proposal to ban face coverings in public
స్విట్జర్లాండ్‌లో 'బుర్ఖా' నిషేధంపై రెఫరండం

By

Published : Mar 8, 2021, 9:53 AM IST

బహిరంగ ప్రదేశాల్లో ముఖం కనిపించకుండా వేసుకొనే మాస్కులు, బుర్ఖాల నిషేధంపై స్విట్జర్లాండ్‌లో ఆదివారం రెఫరండం జరిగింది. ఈ వివాదాస్పద తీర్మానానికి అనుకూలంగా 51.21 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో.. బహిరంగ ప్రదేశాల్లో ముఖాలను కప్పే మాస్కులు, బుర్ఖాలు, ఇతర వస్త్రాలు ధరించడం ఇకపై అక్కడ నేరంగా పరిగణిస్తారు. అయితే.. ప్రార్థనా స్థలాలకు మినహాయింపిచ్చారు. ఆరోగ్య, భద్రతా కారణాలతోనూ ధరించవచ్చు.

స్విట్జర్లాండ్​లోని మిత వాద పార్టీలు ఈ బుర్ఖా నిషేధ తీర్మానాన్ని ప్రతిపాదించాయి. దీనిని అక్కడి మత సంస్థలు, మానవ హక్కుల సంఘాలు, ప్రభుత్వం వ్యతిరేకించాయి. గల్ఫ్‌, ఇతర దేశాల నుంచి వచ్చే ముస్లిం మహిళలే ఎక్కువ మంది బుర్ఖాలు ధరిస్తారని, ఇది పర్యటకంపై ప్రభావం చూపే అవకాశం ఉందని స్విట్జర్లాండ్​ సమాఖ్య ప్రభుత్వం వాదిస్తోంది.

ఇదీ చూడండి:'కరోనాతో మహిళల ఆదాయంపై ప్రతికూల ప్రభావం'

ABOUT THE AUTHOR

...view details