ప్రపంచంలోనే అత్యంత చిన్న పరిమాణంలో బంగారు నాణేన్ని రూపొందించింది స్విట్జర్లాండ్. 2.96మిల్లీమీటర్ నాణెంపై అల్బర్ట్ ఐన్స్టీన్ నాలుక తెరచుకుని ఉన్న చిత్రాన్ని ముద్రించింది.
ప్రపంచంలోనే అతి చిన్న బంగారు నాణెం ఇదే... - words smallest gold coin news
ప్రపంచంలోనే అతిచిన్న బంగారు నాణేన్ని తయారు చేసింది స్విట్జర్లాండ్. నిశితంగా పరిశీలించి చూస్తే ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్స్టీన్ కనిపించేలా ఈ నాణేన్ని రూపొందించారు.
ప్రపంచంలోనే అతిచిన్న బంగారునాణెంపై ఐన్స్టీన్
0.063 గ్రాములు(ఔన్సులో 500వ వంతు) ఉన్న ఈ పసిడి నాణెం విలువ 0.26డాలర్లు. స్విస్మింట్ దీనిని తయారు చేసింది. ఇలాంటివే మరో 999 నాణేలను వేలంపాట కోసం సిద్ధం చేసింది. ఒక్కో నాణేన్ని 205డాలర్లకు విక్రయించనున్నారు. నాణెంతో పాటు ప్రత్యేక భూతద్దాన్ని ఇస్తారు. దీని సాయంతో ఐన్స్టీన్ చిత్రాన్ని చూడవచ్చు.
Last Updated : Feb 18, 2020, 3:00 AM IST