తెలంగాణ

telangana

ETV Bharat / international

స్విస్​ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల సంపద - నల్లధనం

స్విట్జర్లాండ్​ బ్యాంకుల్లో భారతీయులు దాచిన డబ్బు 2018లో 6 శాతం తగ్గింది. 20 ఏళ్లలో ఇదే రెండో అతిపెద్ద తగ్గుదల అని స్విస్​ నేషనల్​ బ్యాంకు (ఎస్​ఎన్​బీ) తెలిపింది.

స్విస్​ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల సంపద

By

Published : Jun 28, 2019, 6:46 AM IST

Updated : Jun 28, 2019, 1:24 PM IST

స్విస్​ బ్యాంకులో తగ్గిన భారత డబ్బు

స్విస్​ బ్యాంకుల్లో భారతీయుల సంపద అత్యంత కనిష్ఠానికి పడిపోయింది. 2018కి గానూ భారతీయుల వ్యక్తిగత, సంస్థలకు చెందిన ఖాతాల్లో 6 శాతం మేర డబ్బు తగ్గిపోయింది. రెండు దశాబ్దాల్లో ఇది రెండో అతిపెద్ద తగ్గుదలని స్విస్​ నేషనల్​ బ్యాంకు (ఎస్​ఎన్​బీ) తెలిపింది. విదేశీయుల సొమ్ము 4 శాతం మేర తగ్గింది.

2018లో స్విస్​ బ్యాంకుల్లో నిల్వ ఉన్న భారతీయుల డబ్బు రూ.6,757 కోట్లుగా ఉంది. విదేశీయుల సొమ్ము రూ.99 లక్షల కోట్లుగా ఉంది. ఈ గణాంకాలన్నీ బ్యాంకులు అధికారికంగా నివేదించినవి. ఇందులో భారతీయుల నల్లధనానికి సంబంధించి ఎలాంటి వివరాలు లేవు. ఎన్​ఆర్​ఐలు, వివిధ దేశాల్లోని సంస్థల పేరుతో దాచిన సొమ్ము ఈ లెక్కల్లో లేకపోవటం గమనార్హం.

ఇదీ చూడండి: నీరవ్ మోదీకి మరో షాక్​- స్విస్​ ఖాతాలు సీజ్

Last Updated : Jun 28, 2019, 1:24 PM IST

ABOUT THE AUTHOR

...view details