తెలంగాణ

telangana

ETV Bharat / international

క్వారంటైన్​ అవ్వాలని ఆ 300 మందికి ఆదేశాలు - కరోనా వైరస్​ స్విట్జర్లాండ్​

స్విట్జర్లాండ్​లో గత వారం ఓ నైట్​క్లబ్​కు వెళ్లిన వ్యక్తికి కరోనా వైరస్​ సోకినట్టు తేలింది. ఈ ఘటనను సూపర్​స్ప్రెడర్​గా పరిగణిస్తూ నైట్​క్లబ్​తో సంబంధం ఉన్న 300మందిని క్వారంటైన్​ అవ్వాలని అక్కడి అధికారులు ఆదేశించారు.

Swiss authorities quarantine 300 people after outbreak in Zurich nightclub
క్వారంటైన్​ అవ్వాలని ఆ 300మందికి ఆదేశాలు

By

Published : Jun 28, 2020, 10:02 PM IST

Updated : Jun 28, 2020, 10:57 PM IST

స్విట్జర్లాండ్​లోని ఓ నైట్​క్లబ్​లో కరోనా వైరస్​ కలకలం రేపింది. సూపర్​స్ప్రెడర్​​గా భావిస్తున్న ఈ ఘటన వల్ల 300మందిని క్వారంటైన్​ అవ్వాలని ఆదేశించారు అధికారులు.

వారం క్రితం ఫ్లెమింగో క్లబ్​కు వెళ్లిన ఓ వ్యక్తికి గురువారం కరోనా నిర్ధరణ అయ్యింది. అనంతరం అతడితో పాటు ఉన్న మరో ఐదుగురికి కూడా వైరస్​ సోకినట్టు తేలింది.

ఈ నేపథ్యంలో నైట్​క్లబ్​ నుంచి నాడు కార్యక్రమంలో పాల్గొన్నవారి జాబితాను తీసుకున్నారు అధికారులు. అనంతరం ఆ రోజు క్లబ్​కు వెళ్లిన వారందరినీ 10రోజుల పాటు క్వారంటైన్​లో ఉండాలని ఆదేశించారు.

లాక్​డౌన్​ ఆంక్షలు సడలిస్తున్నప్పటికీ... భౌతిక దూరం సహా ఇతర నిబంధనలు పాటించడం ఎంత ముఖ్యమో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలని అధికారులు తెలిపారు. ఈ తరహా ఘటనలు పెరిగితే.. నైట్​క్లబ్​లను మూసివేయక తప్పదన్నారు.

స్విట్జర్లాండ్​లో 31,617 మందికి కరోనా వైరస్​ సోకింది. 1,962మంది వైరస్​కు బలయ్యారు.

ఇదీ చూడండి:-'మా వ్యాక్సిన్​తో కచ్చితమైన ఫలితాలు'

Last Updated : Jun 28, 2020, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details