తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ రైలులో వదిలేసిన రూ.కోటిన్నర గోల్డ్​ ఎవరిది?

లాక్​డౌన్​లోనూ బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాంటి సమయంలో గుర్తుతెలియని కొందరు వ్యక్తులు కోటిన్నర రూపాయలు విలువైన పసిడిని రైలులో వదిలిపెట్టి వెళ్లిపోయారు. అయితే ఆ ప్యాకేజ్​ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. వారి కోసం చాలా నెలలుగా ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే...

USD190K in gold bars unclaimed from Swiss train
ఆ రైలులో వదిలేసిన రూ.కోటిన్నర విలువైన గోల్డ్​ ఎవరిది?

By

Published : Jun 17, 2020, 5:17 PM IST

రైలులో అక్రమంగా బంగారం తరలిస్తూ దొరికిన సంఘటనలు చాలానే టీవీల్లో చూస్తుంటాం. కోట్ల విలువైన విదేశీ బంగారం బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకుంటారు. పోలీసులకు దొరికిన వ్యక్తులను జైలుకు తరలిస్తారు. అయితే స్విట్జర్లాండ్​లో ఇలాంటి తరహా ఘటన ఒకటి జరిగింది. అయితే విచిత్రంగా రైలులో వదిలేసిన బంగారాన్ని యజమానులు వచ్చి తీసుకెళ్లాలని అభ్యర్థిస్తున్నారు పోలీసులు. ఇందుకోసం కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్నారట.

ఐదేళ్ల సమయం..

స్విట్జర్లాండ్​లోని సెయింట్​ గాలెన్​ నుంచి లుసెర్నే బయలుదేరిన ఓ రైలులో భారీ ప్యాకెట్​ను స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు. ఈ సంఘటన గతేడాది అక్టోబర్​లో జరిగింది. అయితే దాన్ని తీసుకోవాలని ఇప్పటివరకు అధికారులు ఎన్నోసార్లు ప్రకటన చేసినా ఎవరూ రావట్లేదట. ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడం వల్ల ఇటీవలె కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ నిధి తీసుకునేందుకు 5 ఏళ్ల వరకు గడువు ఇస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఆ తర్వాత ఎవరూ తీసుకోకపోతే అది ప్రభుత్వ ఖజానాలో చేరనుంది.

గతంలోనూ ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. దాదాపు 500 యూరో నోట్ల కట్టలు ఓ రెస్టారెంట్​ బాత్​రూంలో వదిలేసి వెళ్లారు. అప్పట్లో ఆ విషయం బాగా చర్చనీయాంశమైంది.

ఇదీ చూడండి:రీల్​ కాదు రియల్​.. గాల్లో ఎగిరిన ఆయిల్​ ట్యాంకర్​

ABOUT THE AUTHOR

...view details