స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉండే వృద్ధురాలు దాదాపు 28ఏళ్లపాటు తన కుమారుడిని ఓ గదిలో బంధించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం బాధితుని వయసు 41ఏళ్లు కాగా.. 13ఏళ్ల వయస్సులో అతన్ని నిర్బంధించినట్లు భావిస్తున్నారు.
ఏం జరిగింది?
ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన సదరు మహిళ.. దూరపు బంధువుకు ఫోన్ చేసి తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని అభ్యర్థించింది. ఆమె ఇంటికి వచ్చిన బంధువు గదిలో బందీగా ఉన్న ఆ మహిళ కుమారుడ్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిర్బంధంలో ఉన్న కుమారుడ్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వృద్ధురాలు, కుమారుడితోపాటు బంధువును విచారిస్తున్నారు.
కుమారుడ్ని 28ఏళ్లు నిర్బంధించి అతని స్వేచ్ఛను హరించటంతోపాటు పలుమార్లు గాయపరిచిందని న్యాయవాది ఎమ్మా ఓల్సన్ తెలిపారు.
ఇదీ చదవండి:ఆ నగరంపై దుండగులు దండయాత్ర- బ్యాంక్ లూటీ