తెలంగాణ

telangana

ETV Bharat / international

'భయమొద్దు.. డెల్టాకంటే ఒమిక్రాన్ తీవ్రత తక్కువే.. కానీ...' - imperial college london

Omicron severity: కరోనా డెల్టా వేరియంట్​తో పోలిస్తే 'ఒమిక్రాన్' తక్కువ తీవ్రతను కలిగిస్తుందని రెండు అధ్యయనాలు స్పష్టం చేశాయి. చాలా తక్కువ మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పాయి. అయితే.. టీకా తీసుకోని వారికి మాత్రం ఆస్పత్రుల్లో చేరాల్సిన ముప్పు ఎక్కువగా ఉందని హెచ్చరించాయి. మరోవైపు.. ఒమిక్రాన్ వేరియంటే చివరి కరోనా వేరియంట్ కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Omicron severity
ఒమిక్రాన్ తీవ్రత

By

Published : Dec 23, 2021, 4:04 PM IST

Omicron severity: ఒమిక్రాన్​.. పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వేరియంట్ కారణంగా వివిధ దేశాల్లో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్​లోని రెండు అధ్యయనాలు.. ఒమిక్రాన్​ వేరియంట్ తీవ్రతపై కీలక విషయాలు వెల్లడించాయి. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ తక్కువ తీవ్రతను కలగిస్తుందని చెప్పాయి. చాలా తక్కువమంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తుందని పేర్కొన్నాయి.

Delta vs Omicron: డెల్టా వేరియంట్​ సోకిన బాధితులతో పోలిస్తే.. ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షల్లో ఒమిక్రాన్ నిర్ధరణ అయిన వ్యక్తుల్లో 40 నుంచి 45 శాతం తక్కువగా ఆస్పత్రుల్లో చేర్చాల్సిన అవకాశాలు ఉన్నాయని లండన్​లోని ఇంపీరియల్ కాలేజీ బృందం తెలిపింది. బాధితులకు ఒక రాత్రి మాత్రమే లేదా అంతకంటే కొద్దిగా ఎక్కువ సేపు మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స అందించాల్సి వచ్చిందని చెప్పింది.

గతంలో కరోనా సోకని వారితో పోలిస్తే.. గతంలో కరోనా సోకి ఒమిక్రాన్ బారినపడినవారు... 50 నుంచి 60శాతం తక్కువగా ఆస్పత్రుల్లో అవకాశం ఉందని ఈ పరిశోధన బృందం తెలిపింది. అయితే... టీకా వేసుకోని వారు ఆస్పత్రుల్లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించింది.

Study on omicron:"డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్‌ బాధితులు ఆసుపత్రిలో చేరే ముప్పు చాలా తగ్గుతున్నట్లు మా విశ్లేషణ రుజువు చేసింది" అని ఇంపీరియల్ కాలీజీ ప్రొఫెసర్​ నీల్​ ఫెర్గూసన్ పేర్కొన్నారు. అయితే.. అధిక వేగంతో సంక్రమించే లక్షణాలు 'ఒమిక్రాన్​'కు ఉన్నందున వైద్య వ్యవస్థపై భారం పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.

56,000 ఒమిక్రాన్​ కేసులు, 2,69,000 డెల్టా వేరియంట్ కేసులను అధ్యయనం చేసి ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులు ఈ ఫలితాలను వెల్లడించారు.

ఇదీ చూడండి:ప్రపంచంపై కొవిడ్ పంజా- అమెరికాలో 2.27 లక్షల కేసులు

2/3 వంతు తక్కువగా..

Omicron hospitalization: డెల్టాతో పోలిస్తే.. ఒమిక్రాన్​ బాధితులు 2/3 వంతు తక్కువగా ఆస్పత్రుల్లో చేరే అవకాశాలు ఉన్నాయని స్కాట్లాండ్​లోని ఎడిన్​ బర్గ్ యూనివర్సిటీ, ఇతర పరిశోధనకర్తలు కలిసి చేసిన అధ్యయనం ద్వారా తెలిసింది. ఒమిక్రాన్​ సోకిన 15 మంది నమూనాలను విశ్లేషించి పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. అయితే.. ఈ ఫలితాలు మంచి వార్తే అయినప్పటికీ... మున్ముందు ఏం జరుగుతుందో చెప్పలేమని స్కాట్లాండ్​కు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్​ జిమ్ మేకనమీన్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'ఒమిక్రాన్ తీవ్రత.. డెల్టా కంటే తక్కువే అని చెప్పలేం!'

దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ తీవ్రత ఎలా ఉందంటే..?

Omicron in south afrcia: దక్షిణాఫ్రికాలో ఇంతకుముందు ఉన్న అన్ని కరోనా వేరియంట్ల కంటే... ఒమిక్రాన్ వేరియంట్ తక్కువ తీవ్రతను కలిగిస్తుందని ఆ దేశంలో చేసిన మరో అధ్యయనం తెలిపింది. అయితే.. ఇతర దేశాల్లో దీని తీవ్రత మారవచ్చు అని విట్​వాటర్సాండ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ చెరిల్​ కోహెన్ తెలిపారు. ఎందుకంటే.. ఆయా దేశాల్లో తక్కువ వ్యాక్సినేషన్ రేటు, గతంలో కొవిడ్ బారినపడిన వారి సంఖ్య తక్కువగా ఉండడం వంటివి కారణాలని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం కరోనా నాలుగో వేవ్ కొనసాగుతుండగా.. బాధితుల్లో 6శాతం మంది ఆస్పత్రుల్లో చేరాల్సి వచ్చిందని దక్షిణాఫ్రికా ప్రజారోగ్య నిపుణుడు వాసిలా జస్సత్ తెలిపారు. గతంలోని వేవ్​​లలో 16శాతం కేసులు ఆస్పత్రుల్లో చేరాల్సి వచ్చిందని చెప్పారు.

ఇదీ చూడండి:దేశంలో ఒమిక్రాన్ కలవరం- 9ఏళ్ల బాలికకు పాజిటివ్

'ఇదే చివరిదని చెప్పలేం'

కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​తో ప్రపంచమంతా భయాందోళన చెందుతోంది. అయితే.. ఒమిక్రాన్ మాత్రమే చివరి వేరియంట్ కాదని... భవిష్యత్​లో మరిన్ని వేరియంట్లు పుట్టుకు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే.... ఒమిక్రాన్ ఆఖరిది కాకపోయినా చివరి వేరియంట్ ఆఫ్​ కన్సర్న్​ (ఆందోళకరమైన వేరియంట్)​ అయ్యే అవకాశాలు ఉన్నాయని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన బెన్ కృష్ణ తెలిపారు. అయితే.. కొవిడ్ కారక సార్స్​ కొవ్ వైరస్​​ తక్కువగా ఉత్పరివర్తనం చెందితే.. స్థానిక వ్యాధిగా(ఎండెమిక్​) కరోనా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:

ఆ దేశంలో నాలుగో డోసు.. చైనాలో అక్కడ లాక్​డౌన్​

బ్రిటన్​లో కొవిడ్ పంజా.. తొలిసారి లక్షకుపైగా కేసులు

ABOUT THE AUTHOR

...view details