తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఒమిక్రాన్ తీవ్రత.. డెల్టా కంటే తక్కువే అని చెప్పలేం!' - ఒమిక్రాన్​పై టీకాలు

Omicron severity: కరోనా ఒమిక్రాన్ వేరియంట్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వేరియంట్​ ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందే లక్షణాలు ఉన్నప్పటికీ.. అధిక తీవ్రతను కలిగించదని అందరూ భావిస్తున్నారు. అయితే.. అలా నమ్మేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. టీకాల ద్వారా, గతంలో వైరస్​ బారినపడిన ద్వారా కలిగే రోగ నిరోధక శక్తిని ఏమార్చే సామర్థ్యం ఈ వేరియంట్​కు ఉన్నట్లు చెప్పింది.

omicron seviority
ఒమిక్రాన్ తీవ్రత

By

Published : Dec 20, 2021, 5:18 PM IST

Omicron severity: డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్​ డేంజరా? ఒమిక్రాన్​పై టీకాలు పని చేయవా? గతంలో కరోనా బారినపడ్డవారు కూడా 'ఒమిక్రాన్' బాధితులుగా మారాల్సిందేనా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు కరవయ్యాయి. కరోనా డెల్టా వేరియంట్​ కంటే ఒమిక్రాన్ వేరియంట్​ తక్కువ తీవ్రతను కలిగిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు అని బ్రిటన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. అంతేగాకుండా.. గతంలో వైరస్​ సోకడం ద్వారా లేదా టీకా తీసుకోవడం వల్ల కలిగే రోగ నిరోధక శక్తినీ ఏమార్చే సామర్థ్యం ఈ వేరియంట్​కు ఉన్నట్లు వెల్లడైంది.

Omicron reinfection: ఒమిక్రాన్​ తీవ్రత, ప్రభావాలను అంచనా వేసేందుకు లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. ఒమిక్రాన్ వేరియంట్​తో రీఇన్​ఫెక్షన్ ముప్పు డెల్టా వేరియంట్​ కంటే 5.4 రెట్లు అధికం అని పరిశోధకులు తెలిపారు. ఇన్‌ఫెక్షన్‌ నుంచి పొందిన రక్షణను 19శాతం తగ్గిస్తున్నట్లు అంచనా వేశారు.

"డెల్టా కంటే ఒమిక్రాన్ తక్కువ తీవ్రతను కలిగిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. లక్షణాలతో పాజిటివ్​గా తేలిన వ్యక్తులు, వైరస్​తో ఆస్పత్రుల్లో చేరిన వ్యక్తుల ఆధారంగా ఇది నిర్ధరణ అవుతుంది. అయితే.. ప్రస్తుతానికి ఆస్పత్రుల్లో చేరేవారి సమాచారం మాత్రం తక్కువగా ఉంది."

- పరిశోధకులు

ఇదీ చూడండి:ప్రపంచాన్ని ఒమిక్రాన్‌ చుట్టుముడుతోంది..మూడో డోసు తప్పనిసరి!

Deltva vs Omicron: బ్రిటన్​లో నవంబరు 29 నుంచి డిసెంబరు 11 మధ్య ఆర్​టీపీసీఆర్​ పరీక్షల్లో కరోనా పాజిటివ్​ తేలిన కేసులపై పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. వీరి నివేదిక ఇంకా ప్రచురితం కాలేదు. ఎస్​ జీన్ టార్గెట్ ఫెయిల్యూర్(ఎస్​జీటీఎఫ్​) కారణంగా ఒమిక్రాన్ బారినపడినట్లు గుర్తించిన వ్యక్తులు సహా జన్యు పరీక్షల్లో ఒమిక్రాన్​ సోకినట్లు తేలిన కేసుల సమాచారాన్ని పరిశోధకులు పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తం 1,96,463 మంది ఎస్​ జీన్ టార్గెట్​ ఫెయిల్యూర్​ కాని వ్యక్తులు, 11,329 ఎస్​ జీన్ టార్గెట్ ఫెయిల్యూర్ వ్యక్తులు, 1,22,063 మంది డెల్టా బాధితులు, 1,846 ఒమిక్రాన్ బాధితులపై ఈ అధ్యయనం జరిగింది.

Omicron doubling rate: ప్రతి రెండు రోజులకొకసారి ఒమిక్రాన్ కేసుల సంఖ్య రెట్టింపు స్థాయికి చేరుతోందని పరిశోధకులు గుర్తించారు. ఒమిక్రాన్ రీప్రొడక్షన్ నంబర్​(ఆర్ నంబర్​).. 3 కంటే అధికంగా ఉందని తేలిందని చెప్పారు. "గతంలో వైరస్ సోకడం ద్వారా, వ్యాక్సినేషన్ ద్వారా అందించిన రోగనిరోధక శక్తిని ఒమిక్రాన్ ఎంతమేర ఏమార్చగలదానిపై ఈ అధ్యయనం మరిన్ని ఆధారాలను అందించింది. ఈ స్థాయిలో రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకోవడం ఇది ప్రజారోగ్యానికి భారీ ముప్పును కలిగిస్తుంది" అని ఇంపీరియల్ కాలేజీ లండన్​కు చెందిన ప్రొఫెసర్ నీల్​ పెర్గూసన్ తలిపారు.

ఇదీ చూడండి:Third Wave In India: 'వచ్చే ఏడాది ప్రారంభంలో కరోనా థర్డ్​ వేవ్​'

ఇదీ చూడండి:India omicron variant: 'ఒమిక్రాన్'​తో మరో ముప్పు తప్పదా?

ABOUT THE AUTHOR

...view details