దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలోసీబీఎస్ఈ 10, 12వ తరగదుల పరీక్షలను రద్దు చేసింది. జూన్ 1 నుంచి 15 మధ్య జరగాల్సిన పరీక్షలు నిర్వహించలేమని స్పష్టం చేసింది. విద్యార్థులను కరోనా నుంచి రక్షించేందుకే పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సైతం ఆమోదించింది.
కరోనా మహమ్మారి బెడద ప్రపంచవ్యాప్తంగా ఉన్నందున ఇతర దేశాల సైతం పరీక్షలపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. చాలా దేశాలు పరీక్షలను రద్దు చేయగా.. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పరీక్షలను తప్పక నిర్వహించి తీరుతామని మరికొన్ని దేశాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇదీ చదవండి-సీబీఎస్ఈ ఫైనల్ మార్కులు లెక్కిస్తారిలా...
భారత్ సహా అంగోలా, ఇండోనేసియా, మాల్టా, మెక్సికో, మైక్రోనేసియా, మంగోలియా, వెనెజువెలా దేశాలు పరీక్షలను రద్దు చేసి ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తున్నాయి. అరబ్ దేశాలు మాత్రం పరిశుభ్రమైన వాతావరణంలో, వైరస్ నియంత్రణ చర్యలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఈజిప్ట్, సిరియా, పాలస్తీనా, మొరాకో, జోర్డాన్ వంటి దేశాలు ఇప్పటికీ తమ వార్షిక విద్యా ప్రణాళికనే అనుసరిస్తున్నాయి.
పరీక్షల విషయంలో ఇతర దేశాల్లో అవలంబించిన విధానాలు.. ఎంచుకున్న మార్గాల వివరాలు ఇలా ఉన్నాయి.
జర్మనీ
సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షలను యథావిధిగా నిర్వహించాలని జర్మనీ నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తిని తగ్గించేలా పాఠశాలలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇటలీ
ఇప్పటివరకు దేశంలో పరీక్షలను వాయిదా గానీ, రద్దు చేస్తున్నట్లు గానీ ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని విద్యా శాఖ స్పష్టం చేసింది.
ఫ్రాన్స్
జాతీయ ఉపాధ్యాయ నియామక పోటీ పరీక్షలు జూన్, జులై నెలల్లో జరగాల్సి ఉంది. అయితే కొవిడ్-19 పరిస్థితుల కారణంగా ఇది వాయిదా పడే అవకాశం ఉంది.
లగ్జెంబర్గ్
ముందుగా నిర్ణయించిన తేదీల్లోనే సెకండరీ స్కూల్ పరీక్షలు జరగనున్నాయి. అయితే సిలబస్ పూర్తి కాలేదన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రశ్నాపత్రాలు రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు విద్యా శాఖ మంత్రి.
పోలాండ్
పాఠశాలల వార్షిక క్యాలెండర్ను మార్చాల్సిన అవసరం లేదని ప్రభుత్వం సూచనప్రాయంగా తెలిపింది. అయితే దేశంలో ఉన్న ప్రత్యేక చట్టం ప్రకారం కరోనా వైరస్ వంటి వ్యాధులు వ్యాపించిన సమయంలో పరీక్షా తేదీలను మార్చే అధికారం విద్యా శాఖ మంత్రికి ఉంటుంది.
న్యూజిలాండ్
దక్షిణార్థ గోళంలోని దేశాలు పాటించే విద్యా సంవత్సరాన్ని న్యూజిలాండ్ అనుసరిస్తోంది. షెడ్యూల్ ప్రకారం నవంబర్లో పరీక్షలు జరగాల్సి ఉంది. విద్యార్థులు డిజిటల్ మాధ్యమంలోనూ పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తోంది.
కజకిస్థాన్
పరీక్షలు రద్దు లేదా వాయిదా వేయడం అసాధ్యమని దేశ విద్యా శాఖ స్పష్టం చేసింది. డిస్టెన్స్ లెర్నింగ్ ప్రవేశపెట్టినా గానీ.. 11వ గ్రేడ్ తర్వాత నిర్వహించే యూనైటెడ్ నేషనల్ టెస్ట్ సహా అన్ని పరీక్షలను పాత పద్ధతుల్లోనే నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
బ్రెజిల్