తెలంగాణ

telangana

ETV Bharat / international

జర్మనీలో తుపాను.. రైళ్ల రాకపోకలకు అంతరాయం! - బెర్లిన్​లోని రెండు జూ పార్కులను అధికారులు మూసివేశారు.

ఉత్తర జర్మనీలో భయంకరమైన ఈదురు గాలులు సంభవించాయి ఈ నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బెర్లిన్​లో వరద హెచ్చరికలతో అధికారులు రెండు జూ పార్కులను తాత్కాలికంగా మూసివేశారు.

జర్మనీలో తుపాను.. రైళ్ల రాకపోకలకు అంతరాయం!

By

Published : Sep 30, 2019, 10:02 PM IST

Updated : Oct 2, 2019, 4:07 PM IST

ఉత్తర జర్మనీలో ఈదురు గాలులతో కూడిన తుపాను బీభత్సం సృష్టించింది. భీకరమైన గాలులకు కొద్ది గంటలపాటు పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైళ్ల సమయవేళల్లో మార్పులతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటల తరబడి స్టేషన్లలోనే వేచి ఉన్నారు. వరద హెచ్చరికల నేపథ్యంలో బెర్లిన్​లోని రెండు జూ పార్కులను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.

జర్మనీలో తుపాను.. రైళ్ల రాకపోకలకు అంతరాయం!

బెర్లిన్, హాంబర్గ్, హన్నోవర్​ రైలు మార్గాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. వీటితో పాటు ఇతర మార్గాలనూ నిలిపివేశారు. ఈదురు గాలులకు వోల్ఫ్స్‌బర్గ్ ప్రాంతంలో వేగంగా ప్రయాణిస్తున్న రైలుపై చెట్లు కూలాయి. ఈ ఘటనలో రైలు​ చోదకుడు స్వల్పంగా గాయ పడ్డాడు.

పశ్చిమ జర్మనీ డోర్ట్​మండ్​లో కురుస్తున్న వానలకు పలు ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదల ధాటికి పలు వన్యప్రాణులు మరణించాయి.

ఇదీ చూడండి: హెల్మెట్లతో గుజరాతీ యువత గార్బా నృత్యం

Last Updated : Oct 2, 2019, 4:07 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details