శరీరంలోని కొవ్వు స్థాయులను తగ్గించేందుకు వాడే స్టాటిన్ ఔషధాలు.. కొవిడ్ కారక మరణ ముప్పునూ కొంతవరకూ దూరం చేస్తాయని తాజా పరిశోధనలో రూఢి అయింది. అధిక కొలెస్ట్రాల్ కారణంగా రక్తనాళాల్లో పూడికలు ఏర్పడతాయి. దీంతో రక్త ప్రవాహం సజావుగా సాగదు. ఫలితంగా గుండెపోటు, పక్షవాతం వచ్చే ముప్పు ఎక్కువవుతుంది. వైద్యుల సలహాతో 'స్టాటిన్' మాత్రలను వాడితే.. రక్తంలోని లిపో-ప్రొటీన్ కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయి. ఫలితంగా హృద్రోగ ముప్పూ కొంతమేర తక్కువవుతుంది. మహమ్మారి తలెత్తిన తొలిరోజుల్లో.. 'కొవిడ్ కారక మరణముప్పును స్టాటిన్లు తగ్గిస్తాయా? అన్నది వైద్య నిపుణులు, పరిశోధకుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. అయినా, వారు ఏ నిర్ణయానికీ రాలేకపోయారు.
'స్టాటిన్లతో కొవిడ్ కారక మరణముప్పు దూరం' - స్టాటిన్ కొలెస్ట్రాల్
స్టాటిన్ మాత్రలు.. శరీరంలోని కొవ్వు స్థాయులను తగ్గించేందుకు ఉపయోగించే ఈ మందులు కరోనా కారణంగా తలెత్తే మరణముప్పును దూరం చేస్తాయని పరిశోధనలో తేలింది. ప్రధానంగా.. హృద్రోగ ముప్పును తగ్గించేందుకు వైద్యుల పర్యవేక్షణలో స్టాటిన్లను వాడితే మంచి ఫలితాలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
స్టాటిన్ల
ఈ క్రమంలోనే స్వీడన్‌ను చెందిన ఓ సంస్థ ఈ అంశంపై అధ్యయనం చేపట్టింది. ఇందులో భాగంగా 45 ఏళ్లు దాటిన 9,63,876 మందికి మార్చి-నవంబరు మధ్య స్టాక్‌హోమ్‌లో వైద్యులు ఏమేం ఔషధాలను సూచించారన్న వివరాలు సేకరించారు. వారిలో కొందరు మృతిచెందగా, అందుకు కారణాలేంటన్నది కూడా తెలుసుకున్నారు. అనంతరం ఈ వివరాలను విశ్లేషించారు.
ఇవీ చదవండి: