రష్యా రూపొందించిన స్పుత్నిక్ వీ టీకా 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. అధ్యక్షుడి వ్యాఖ్యలను రష్యా విదేశీ వ్యవహారాల శాఖ ట్విట్టర్లో పంచుకుంది.
"ప్రపంచంలో తొలి కొవిడ్ వ్యాక్సిన్‌ను రష్యా రూపొందించింది. మా దగ్గర సురక్షితమైన, వైరస్‌పై 95 శాతం ప్రభావం చూపే వ్యాక్సిన్ ఉంది. ఈ టీకా 96-97 శాతం రక్షణ ఇస్తుందని నిపుణులు తెలిపారు."
- వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు