కరోనా మహమ్మారి స్పెయిన్‌లో మృత్యుఘంటికలు మోగిస్తూనే ఉంది. కానీ వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల మొక్కవోని ధైర్యం, సేవాభావంతో పనిచేస్తున్నారు. అలాంటి వారికి ఘనంగా అభినందనలు తెలిపారు మాడ్రిడ్ ప్రజలు.
కరతాళ ధ్వనులతో...
శనివారం సాయంత్రం... మాడ్రిడ్‌లోని జిమెనెజ్ డియాజ్ ఫౌండేషన్ ఆసుపత్రి వెలుపల అంబులెన్స్ సైరన్ల మోత మోగిపోయింది. విద్యుత్ దీపాలు ధగధగలాడాయి. సమీప నివాస భవనాల్లోని ప్రజలు ఒక్కసారిగా బయటకు వచ్చారు. కరతాళ ధ్వనులు చేస్తూ... కరోనా బాధితులకు 24 గంటలూ అత్యవసర సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలను మనసారా అభినందనలు తెలిపారు.