రంగురంగుల గుర్రాలతో రయ్రయ్ మంటూ..! స్పెయిన్లో నిర్వహించే అత్యంత ముఖ్యమైన ఉత్సవాల్లో ఒకటైన 'రన్నింగ్ ఆఫ్ ద వైన్'గురువారం ఘనంగా జరిగింది. మెడియవాల్ గ్రామంలో నిర్వహించిన గుర్రపు పందెం చూసేందుకు వేల మంది ప్రజలు హాజరయ్యారు. రంగురంగుల దుస్తులతో గుర్రాలను అందంగా అలంకరించారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
నియమాలు...
ఒక్కో గుర్రంతో నలుగురు వ్యక్తులు ఇరువైపులా ఉండి.. దానితో పాటు పరుగెత్తాలి. 80 మీటర్ల వరకు పరుగెత్తగలిగిన బృందం విజయం సాధిస్తుంది. ఈ పందెంలో గుర్రాలు అదుపుతప్పి ప్రేక్షకులపైకి వెళ్లటం వల్ల పలువురికి గాయాలయ్యాయి.
" రన్నింగ్ ఆఫ్ ద వైన్ ఆటను మేము కొనసాగించాం. గుర్రంతో పాటు ఉండే వారు 80 మీటర్ల వరకు పరుగెత్తాలి. అందులోని నలుగురూ చివరి వరకు ఉండాలి. " - పేపే సాంచెజ్, స్థానికుడు
స్పెయిన్పై మూరిష్ దండయాత్ర సమయంలో తీవ్ర తాగు నీటి ఎద్దడి వచ్చింది. నీళ్లు లేక అందుబాటులో ఉన్న మద్యాన్ని మూరిష్ సైనికులకు తెలియకుండా గుర్రాలపై గ్రామాలకు తరలించారట స్థానికులు. అప్పటి నుంచి అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:ఒడిశాలో నేడు విమానాలు బంద్, 220 రైళ్ల రద్దు