ర్యాప్ సింగర్ పాబ్లో హాసెల్ అరెస్టును నిరసిస్తూ... వరుసగా నాలుగు రోజుల నుంచి స్పెయిన్లో అల్లర్లు చెలరేగుతున్నాయి. కాటలోనియా, బార్సిలోనా సహా మూడు ఇతర ప్రధాన నగరాల్లో నిరసనకారులు అందోళనలు చేస్తూ హింసకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అధికారులపై రాళ్లు రువ్వడం, బాటిళ్లు విసరడం వంటివి చేస్తూ వాహనాలకు నిప్పంటిస్తున్నట్లు పేర్కొన్నారు.
మరికొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు... కంటైనర్లను తగలబెడుతూ వీధులను దిగ్బంధించారు. బార్సిలోనాలో కొందరు బ్యాంకుల్లోకి చొరబడి నిప్పంటించేందుకు ప్రయత్నాలు చేశారని పోలీసులు పేర్కొన్నారు. గిరోనా, కాటలాన్ సిటీలో నిరసనకారులు మూడు బ్యాంకుల కిటికీలను ధ్వంసం చేసినట్లు స్పష్టం చేశారు.