తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో 24 గంటల్లోనే 2,500 మంది మృతి

యావత్‌ ప్రపంచాన్ని.. కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. వైరస్‌ బారినపడిన వారి సంఖ్య 32 లక్షల 19 వేలు దాటింది. 2 లక్షల 28 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 10 లక్షలను అధిగమించింది. అమెరికాలో 24 గంటల వ్యవధిలోనే 2 వేల 500 మందికిపైగా బలయ్యారు. ఐరోపా దేశాల్లో మళ్లీ కరోనా కేసులు, మరణాల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది.

Spain reports 325 new COVID-19 deaths
అమెరికాలో 24 గంటల్లోనే 2,500 మంది మృతి

By

Published : Apr 30, 2020, 6:56 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. కేసులు 32 లక్షలు దాటగా.. 2 లక్షల 28 వేలమందికిపైగా బలయ్యారు. అమెరికాలో మహమ్మారి విజృంభణ తీవ్రరూపం దాల్చింది. రోజుకు 25 వేలకుపైగా కొత్త కేసులు బయటపడుతూనే ఉన్నాయి. అమెరికాలో మొత్తం కొవిడ్‌ కేసులు 10 లక్షల 65 వేలకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లోనే 2 వేల 502 మరణాలు సంభవించాయి. దేశంలో మృతుల సంఖ్య 61 వేలు దాటింది. లక్షా 47 వేలకుపైగా కోలుకున్నారు.

1955 నుంచి 1975 వరకు భీకరంగా సాగిన వియత్నాం యుద్ధంలో 58 వేల 200 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా... అంతకంటే ఎక్కువగా అమెరికన్లను కరోనా బలితీసుకుంది.

ఆ దేశాల్లో మళ్లీ...

ఐరోపా దేశాల్లోనూ వైరస్‌ వ్యాప్తి ఏమాత్రం తగ్గటం లేదు. స్పెయిన్‌లో.... మొత్తం కేసులు 2లక్షల 36 వేల 900కు చేరువకాగా... 24 వేల 275 మంది మృతిచెందారు. గడిచిన 24 గంటల్లో 453 మంది చనిపోయారు. రష్యాలోనూ కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరువయ్యాయి. కొత్తగా 5 వేల 841 కేసులు నమోదవగా ఒక్కరోజే 105 మంది మృతి చెందారు.

  • ఇటలీలో బుధవారం 323, యూకేలో 795 మంది కరోనా ధాటికి చనిపోయారు.
  • ఇరాన్‌లో మొత్తం బాధితుల సంఖ్య 93వేల 657కు చేరింది. మరణాలు 5వేల 957కు పెరిగాయి.
  • బ్రెజిల్‌లో మొత్తం కేసులు 79 వేల 361కు చేరాయి. కొత్తగా 448 మరణాలు నమోదవగా ఇప్పటివరకు 5వేల 511 మంది మృతిచెందారు.
  • బెల్జియంలో మాత్రం కరోనా పంజా విసురుతూనే ఉంది. మొత్తం కేసులు 47 వేల 859కి చేరగా 7వేల 501 మంది మరణించారు.
  • నెదర్లాండ్స్‌లో మొత్తం కేసులు.. 38వేల 802కు చేరగా...ఇప్పటిదాకా 4వేల 711 మంది మరణించారు.

మిగతా దేశాల్లో...

సౌదీ అరేబియాలో మొత్తం కేసులు 21 వేల 400 దాటాయి. వారిలో.. 157 మంది మృతి చెందారు.

స్వీడన్‌లో కొవిడ్‌కేసులు 20వేల 300 దాటగా 2వేల 462 మంది మరణించారు.

సింగపూర్‌లో మొత్తం కేసులు 15వేల 641కి చేరగా కొత్తగా 690 కేసులు బయటపడ్డాయి. పాకిస్థాన్​లోనూ కొత్తగా 913 కేసులు నమోదవగా మొత్తం బాధితులు 15వేల 525 కి చేరారు. ఇప్పటివరకు 343 మంది చనిపోయారు.

ABOUT THE AUTHOR

...view details