ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విస్తరిస్తున్న వేళ.... వైరస్ బాధితుల సంఖ్య 10 లక్షలు దాటింది. దేశంలో ఇప్పటివరకూ 10 లక్షల 10 వేల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. మొత్తంగా 56 వేలకుపైగా చనిపోయారు. జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లోనే 1303 మంది కొవిడ్ ధాటికి ప్రాణాలు విడిచారు. బాధితుల్లో లక్షా 38 వేల మంది కోలుకున్నారు. ఐరోపా దేశాలైన స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్‌లలో క్రితం రోజుతో పోలిస్తే కరోనా మరణాలు మరోసారి పెరిగాయి.
అక్కడ తగ్గుతూ.. పెరుగుతూ...
- స్పెయిన్‌లోనూ నిత్యం వేలాది కొత్త కేసులు నమోదవుతుండగా.. నిన్న 331 మంది చనిపోయారు. మొత్తం బాధితుల సంఖ్య 2లక్షల 29 వేల 422కు చేరింది. మృతుల సంఖ్య 23వేల 521గా నమోదైంది.
- ఇటలీలో కొవిడ్ కేసులు లక్షా 99 వేల 414 కు చేరగా.. సుమారు 27 వేల మంది చనిపోయారు. సోమవారం మరో 333 మంది మరణించారు.
- ఫ్రాన్స్‌లో లక్షా 65వేల 842 మంది వైరస్ బారినపడగా....23వేల 293 మంది మృతిచెందారు. సోమవారం ఒక్కరోజే 437 మందికి పైగా చనిపోయారు.
- జర్మనీలో లక్షా 58 వేల 389 మందికి వ్యాధి సోకగా మృతుల సంఖ్య 6 వేలు దాటింది. ఇప్పటివరకూ లక్షా 58 వేల 389 మంది కోలుకున్నారు.
- బ్రిటన్‌లో లక్షా 57వేల 149 మంది వైరస్‌బారిన పడితే..21 వేల 92 మంది చనిపోయారు.
మిగతా దేశాల్లో...