కొవిడ్ నివారణకు వినియోగించే ఆస్ట్రాజెనెకా టీకాను తాత్కాలికంగా స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు నిలిపివేశాయి. పలుదేశాల్లో ఈ టీకా తీసుకున్న వారికి రక్తంలో సమస్యలు ఎదురైన నేపథ్యంలో .. వ్యాక్సిన్ పంపిణీని తాత్కాలికంగా ఆపేయాలని నిర్ణయం తీసుకున్నాయి.
ఆ దేశాల్లోనూ ఆస్ట్రాజెనెకా టీకా తాత్కాలిక నిలిపివేత
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని నిలిపివేస్తున్న దేశాల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఈ జాబితాలో స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ చేరాయి. పలుదేశాల్లో ఈ టీకా తీసుకున్న వారికి రక్తంలో సమస్యలు ఎదురైన నేపథ్యంలో.. వ్యాక్సిన్ పంపిణీని తాత్కాలికంగా ఆపేయాలని నిర్ణయం తీసుకున్నాయి ఆ దేశాలు.
ఆ దేశాల్లో ఆస్ట్రాజెనెకా టీకా తాత్కాలిక నిలిపివేత
స్పెయిన్లో రెండు వారాలపాటు ఈ వ్యాక్సిన్ను నిలిపివేస్తూ ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి కరోలినా డేరియస్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి :'ఆరోపణలు అవాస్తవం.. మా టీకా సేఫ్'