తెలంగాణ

telangana

ETV Bharat / international

బొమ్మకోసం 2 ఊళ్ల గొడవ.. నల్ల రంగుతో దాడులు - గాడిక్స్​

స్పెయిన్​లో ఒక బొమ్మకోసం రెండు ఊళ్లు గొడవ పడుతున్నాయి. 15వ శతాబ్దంలో మొదలైన ఈ గొడవ ఇప్పటికీ కొనసాగుతోంది. కానీ ప్రస్తుతం దీన్ని ఒక పండుగలా జరుపుకుంటున్నారు. ఆ పండుగ విశేషాలేంటో తెలుసుకుందామా?

బొమ్మకోసం 2 ఊర్ల గొడవ.. నల్ల రంగుతో దాడులు

By

Published : Sep 7, 2019, 11:07 AM IST

Updated : Sep 29, 2019, 6:15 PM IST

బొమ్మకోసం 2 ఊళ్ల గొడవ.. నల్ల రంగుతో దాడులు

రెండు ఊర్ల మధ్య మొదలైన గొడవ.. ఇప్పుడు పండుగలా మారింది. అందుకు స్పెయిన్​ బాజా పట్టణం వేదికైంది. ఏటా ఇక్కడ 'కాస్​కెమొర్రాస్​ ఉత్సవం' నిర్వహిస్తారు. శుక్రవారం జరిగిన వేడుకల్లో 15 వేల మంది పాల్గొన్నారు. నల్ల రంగుతో పరస్పరం దాడులు చేసుకున్నారు.

ఈ సంప్రదాయం 15వ శాతాబ్దంలో ఒక గొడవతో మొదలైంది. గాడిక్స్​కు చెందిన ఓ వ్యక్తికి బాజా ప్రాంతంలో ఒక బొమ్మ దొరికింది. అతడు దాన్ని తన గ్రామానికి తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ బాజాకు చెందిన వారు అందుకు నిరాకరించారు. రెండు ఊర్ల మధ్య బొమ్మ కోసం ఘర్షణ మొదలైంది. అది ప్రస్తుతం పండుగ రూపంలో కొనసాగుతోంది. నల్ల రంగు ఒంటికి అంటకుండా తప్పించుకుంటూ, బొమ్మను బాజా ప్రాంతాన్ని దాటించినవారే విజేత.

ఎంతో సరదాగా, ఉత్కంఠభరితంగా ఈ ఉత్సవం సాగుతుంది. గాడిక్స్​ గ్రామస్థులు కాస్​కెమొర్రాస్​... అంటే దొంగల వేషధారణలో పరుగులు తీస్తారు. మూడురోజుల సమరంలో గాడిక్స్ గ్రామస్థులు బొమ్మను సొంతం చేసుకోవడంలో విఫలమయ్యారు. చివరకు బాజా ప్రజలే విజయం సాధించారు.

ఇదీ చూడండి:లైక్​లు దాయనున్న ఫేస్​బుక్​.. ఎందుకో తెలుసా?

Last Updated : Sep 29, 2019, 6:15 PM IST

ABOUT THE AUTHOR

...view details