ఆగ్నేయ టర్కీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రత నమోదైనట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ దళం, అమెరికా జియోలాజికల్ సర్వే గురువారం వెల్లడించాయి.
ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఉదయం 8.45 గంటల సమయంలో ఆగ్నేయంగా 20 కిలోమీటర్ల మేరకు ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు పేర్కొన్నారు.