తల్లిని సుత్తితో కొట్టి హత్య చేసిన ఓ కొడుకు(son kills mom with hammer).. ఆమె మృతదేహాన్ని రెండు నెలలపాటు ఇంట్లోనే ఉంచాడు. స్నేహితులు, ఇరుగుపొరుగు వారు.. తల్లి గురించి అడిగితే కరోనా సోకిందని, ఐసోలేషన్‌కు వెళ్లిందని చెబుతూ వచ్చాడు. చివరకు నేరం బయటపడటం వల్ల జైలు పాలయ్యాడు. ఈ సంఘటన యూకేలోని వేల్స్ దేశం, పెంబ్రోక్‌షైర్ రాష్ట్రంలో జరిగింది(son kills mother uk).
ఇదీ జరిగింది..
పెంబ్రోక్‌షైర్ రాష్ట్రంలోని పెంబ్రోక్డాక్కు చెందిన జుడిత్ రీడ్ (68), తన కుమారుడు డేల్ మోర్గాన్(43)తో నివసిస్తోంది. ఆమె అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. చివరిసారిగా గత ఏడాది డిసెంబర్ 11న కనిపించినట్లు ఆమె పెంపుడు శునకాన్ని చూసుకునే వ్యక్తి చెప్పాడు. ఇరుగుపొరుగు వారు జుడిత్ గురించి ఆడిగినప్పుడల్లా.. తన తల్లి కరోనా సోకి ఆసుపత్రిలో(Covid isolation) ఉందని చెప్పేవాడు డేల్. ఆమె ఫోన్ నుంచి పలువురికి సందేశాలు కూడా పంపేవాడు. గత ఏడాది క్రిస్మస్కు మూడు రోజుల ముందు తండ్రి కనిపించగా.. జుడిత్ రీడ్ అనారోగ్యానికి గురైందని, ఆమెకు సాయంగా తాను కూడా ఇంట్లోనే ఉంటున్నట్లు చెప్పాడు డేల్.
రెండు నెలలకుపైగా జుడిత్ రీడ్ కనిపించకపోయేసరికి.. ఆమె సన్నిహితులు అధికారులకు సమాచారం అందించారు. డేల్పై అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఇద్దరు పోలీసులు డేల్ ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు.
లోపల ఉన్న చిన్న పడకగది కిటికీ తెరిచి ఉండగా.. అందులోకి చూశారు. దోమ తెరలను పక్కకు జరిపి చూడగానే వారికి భయంకర దృశ్యాలు కనిపించాయి. గదిలో రక్తపు మడుగులో.. బెడ్‌కు సమీపంలో జుడిత్ రీడ్ పడి ఉంది(son kills mom with hammer). ఆమె తలపై ప్లాస్టిక్ బ్యాగ్ కప్పి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.