తెలంగాణ

telangana

ETV Bharat / international

భవనంలోకి దూసుకెళ్లిన విమానం.. 8 మంది మృతి - SMALL PLANE CRASH

విమాన ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అదుపు తప్పిన విమానం ఓ భవనంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన ఇటలీలో జరిగింది.

plane crash
భవనంలోకి దూసుకెళ్లిన విమానం.. 8 మంది మృతి

By

Published : Oct 3, 2021, 7:51 PM IST

Updated : Oct 3, 2021, 9:10 PM IST

విమాన ప్రమాదం

ఇటలీలోని మిలాన్​ పట్టణంలో విమాన ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్​ విమానం ఓ రెండంస్తుల భవనంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది మృతిచెందారు. మృతులు ఫ్రాన్స్​కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.

ఈ ఘటనలో అక్కడే ఉన్న కార్లు ధ్వంసమై మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. విమానం కూలిన భవనంలో కూడా ఎవరూ లేకపోవడం వల్ల పెద్దగా ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.

ఇదీ చూడండి :సముద్ర గర్భంలో యోగా.. ఇదే సరికొత్త ట్రెండ్​!

Last Updated : Oct 3, 2021, 9:10 PM IST

ABOUT THE AUTHOR

...view details