ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చేలా లేదు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు.. ముందు జాగ్రత్త చర్యగా మాస్క్ ధరించాలని చెబుతున్నారు వైద్యులు. కానీ, చాలా మంది నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు మీకెవరైనా కనిపిస్తే, వారికి ఈ వీడియో ఒక్కసారి చూపించండి.
చాలా స్పష్టంగా..
దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు వైరస్ అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా వీడియో ద్వారా చూపించింది ఇంగ్లాండ్కు చెందిన 'స్లో మో గయ్స్' అనే బృందం. ఓ వ్యక్తి గట్టిగా మాట్లాడుతున్నప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు.. 1000 ఫ్రేమ్స్ పర్ సెకండ్స్(ఎఫ్పీఎస్) ద్వారా స్లో మోషన్ వీడియోను చిత్రీకరించారు. వైరస్ కణాలు ఏ విధంగా పయనిస్తాయో ఇందులో స్పష్టంగా చూపించారు. 'గావ్' అనే వ్యక్తి ఈ ప్రయోగం చేశాడు.