తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫిరంగి దాడులు.. అణు విన్యాసాలు.. ఏ క్షణంలోనైనా యుద్ధం! - Shelling in east Ukraine

Shelling in east Ukraine: తూర్పు ఉక్రెయిన్​లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉక్రెయిన్​ సైన్యం, రష్యా వేర్పాటువాదుల పరస్పర దాడులు తారస్థాయికి చేరాయి. మరోవైపు.. సరిహద్దుల్లో రష్యా అణుపాటవాన్ని ప్రదర్శిస్తోంది. అక్కడి పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యా ఎప్పుడేం చేస్తోందన్న భయాలు.. ఆదివారం మరింత తీవ్రమయ్యాయి.

Shelling in east Ukraine
Shelling in east Ukraine

By

Published : Feb 20, 2022, 5:04 PM IST

Updated : Feb 20, 2022, 9:29 PM IST

Shelling in east Ukraine: ఫిరంగి దాడులతో తూర్పు ఉక్రెయిన్​ దద్దరిల్లుతోంది. రష్యా వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. ఏకంగా అక్కడి సైనికాధికారులపైనే వందలాదిగా మోర్టార్లు, ఫిరంగులు ప్రయోగిస్తున్నారు. ఆదివారం కూడా ఇది పునరావృతమైంది. ఈ నేపథ్యంలో వేలాది మంది పౌరులు.. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్నారు. ఇవన్నీ రష్యా- ఉక్రెయిన్​ యుద్ధభయాలను మరింత పెంచుతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

Russia Ukraine War: ఉక్రెయిన్​పై దాడి చేసేందుకు రష్యా సరిహద్దుల వద్ద సిద్ధంగా ఉందని.. పశ్చిమాసియా దేశాల నేతలు హెచ్చరిస్తున్నారు. దాదాపు లక్షా 50 వేల మంది రష్యా సైనికులు ఉక్రెయిన్​ను చుట్టుముట్టారని, యుద్ధవిమానాలు, ఇతర సామగ్రితో ఏ క్షణమైనా దాడి​ చేయొచ్చని సంకేతాలు ఇచ్చారు.

సైనిక విన్యాసాలు..

Russia Nuclear Drills: రష్యా శనివారం భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు నిర్వహించింది. అణుబాంబులను మోసుకెళ్లే బాలిస్టిక్​ క్షిపణులు ఇందులో పాల్గొన్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్​ స్వయంగా.. ఈ అణుపాటవ ప్రదర్శనను వీక్షించారు. సైనిక సన్నద్ధతపై సమీక్షించారు.

ఆదివారం కూడా బ్లాక్​ సీ తీరం వద్ద నావికా విన్యాసాలు నిర్వహించింది రష్యా.

అమెరికా సహా అనేక ఐరోపా దేశాలు.. రష్యా ఉద్రిక్తతల్ని పెంచుతోందని ఆరోపించాయి. ఉక్రెయిన్​పై దండెత్తితే.. రష్యాపై కఠిన ఆంక్షలు తప్పవని ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నాయి. ఇవేం పట్టించుకోని రష్యా.. పెద్దఎత్తున సైనిక ప్రదర్శన చేస్తోంది.

చర్చలకు సిద్ధం..

Russia Ukraine Conflict: ఉద్రిక్తతల్ని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ శనివారం కీలక ప్రతిపాదన తెచ్చారు. ఈ సంక్షోభానికి ముగింపు పలికేందుకు చర్చలకు సిద్ధమని, ఎక్కడ కలుద్దామో చెప్పాలని పుతిన్​ను కోరారు. తమ దేశం దౌత్యమార్గంలోనే శాంతియుత పరిష్కారం కోసం చూస్తోందని స్పష్టం చేశారు. అయితే.. దీనిపై రష్యా నుంచి ఎలాంటి స్పందన లేదు.

సైనిక సమీకరణ..

మరోవైపు.. తూర్పు ఉక్రెయిన్​లోని రష్యా అనుకూల తిరుగుబాటు దారులు భారీ సైనిక సమీకరణ చేపట్టారు. చాలా మంది పౌరుల్ని రష్యాకు తరలించడమే కాకుండా.. తమ సైన్యంలో చేరాలని పిలుపునిస్తున్నారు.

వెనక్కి రండి..

రష్యా మరికొద్దిరోజుల్లో ఉక్రెయిన్​పై దాడి చేయనున్నట్లు అమెరికా నిఘా విభాగానికి సంకేతాలు అందాయని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల​ చెప్పారు. ఉక్రెయిన్​ సరిహద్దుల్లో రష్యా మోహరించిన సైన్యంలోని 40- 50 శాతం దళాలు దాడి చేసేంత సమీపంలో ఉన్నాయని అమెరికా రక్షణ వర్గాలు తెలిపాయి.

యుద్ధమేఘాలు అలముకున్నవేళ ఉక్రెయిన్​ విడిచిరావాలని జర్మనీ, ఆస్ట్రియా, భారత్​ సహా పలు దేశాలు తమ పౌరులకు సూచించాయి. రాజధాని కీవ్​కు లుఫ్తాన్సా తమ విమానాలను రద్దు చేసుకుంది.

ఉక్రెయిన్​లో​ బస తప్పనిసరి కాని భారత పౌరులు, విద్యార్థులు తాత్కాలికంగా ఆ దేశం వదిలిరావాలని సూచించింది కేంద్ర ప్రభుత్వం. ఛార్టర్ ఫ్లైట్లు అందుబాటులో ఉన్నాయని, ఆ సమాచారం కోసం సంబంధిత అధికారులను సంప్రదించాలని స్పష్టం చేసింది.

నాటో కూటమి కూడా కీవ్​లోని తమ కార్యాలయంలోని అధికారులను.. బ్రసెల్స్​కు, ఉక్రెయిన్​లోని లవీవ్​ నగరానికి తరలిస్తున్నామని ప్రకటించింది.

ఇవీ చూడండి:ఉక్రెయిన్​ సైన్యంపై బాంబుల వర్షం.. భయంతో పరుగులు!

Ukraine Crisis: మభ్యపెట్టి దెబ్బతీయడానికి రష్యా సిద్ధం?

Last Updated : Feb 20, 2022, 9:29 PM IST

ABOUT THE AUTHOR

...view details