భూమికి వెలుపల ఎక్కడైనా జీవం ఉందా అన్నది మానవుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. పుడమికి పొరుగునే ఉన్న శుక్ర గ్రహంలో సూక్ష్మజీవుల ఉనికికి సంబంధించిన ఒక ఆధారాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ గ్రహం చుట్టూ ఆవరించిన మేఘాల్లో అరుదైన ఫాస్ఫేన్ వాయువును గుర్తించారు. ఇది భూమిపై పరిశ్రమల నుంచి కానీ ఆక్సిజన్ రహిత వాతావరణాల్లో జీవించే సూక్ష్మజీవుల ద్వారా కానీ వెలువడుతుంటుంది.
శుక్రుడి మేఘాల్లో సూక్ష్మజీవులు? - శుక్రుడి మేఘాల్లో సూక్ష్మజీవులు?
శుక్రగ్రహంపై సూక్ష్మజీవుల ఉనికికి సంబంధించిన ఆధారాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గ్రహం చుట్టూ ఉన్న మేఘాలలో అరుదైన ఫాస్ఫేన్ వాయువును గుర్తించారు. ఆక్సిజన్ రహిత వాతావరణాల్లో జీవించే సూక్ష్మజీవుల ద్వారా ఈ వాయువు వెలువడుతుంది.
శుక్రుడిపై దట్టంగా ఆవరించిన మేఘాల్లో సూక్ష్మజీవులు ఉండొచ్చన్న విశ్లేషణలు ఎప్పటినుంచో ఉన్నాయి. మేఘాల్లో ఆవాసం ద్వారా.. అక్కడి నేలపై ఉన్న తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలను ఆ జీవులు తప్పించుకునే వీలుందని శాస్త్రవేత్తలు అంచనాలు వేశారు. అయితే మేఘాల్లోని తీవ్రస్థాయి ఆమ్లత్వాన్ని అవి తట్టుకోవాలన్నారు. తాజాగా అక్కడ ఫాస్ఫేన్ వాయువు వెలుగు చూడటంతో 'గ్రహాంతర జీవం'పై ఆశలు చిగురించాయి.
హవాయ్‌లోని జేమ్స్ క్లర్క్ మ్యాక్స్ వెల్ టెలిస్కోపు(జేసీఎంటీ) సాయంతో శుక్రుడిపై ఫాస్ఫేన్ జాడను శాస్త్రవేత్తలు పట్టుకొన్నారు దీని పరిమాణం రీత్యా అక్కడి జీవుల ద్వారానే ఇది ఉత్పత్తి అయ్యిఉండొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ జీవులు.. భూమిపై ఉండే సూక్ష్మజీవులకు భిన్నంగా ఉండొచ్చని, అందువల్ల అవి తీవ్రస్థాయి ఆమ్లత్వాన్ని తట్టుకునే వీలుందని చెప్పారు.