తెలంగాణ

telangana

ETV Bharat / international

మీలో ఈ ఏడు లక్షణాలు గుర్తించారా?.. అయితే కరోనా కావచ్చు! - కరోనా లక్షణాలు

కరోనా వైరస్​ బారిన పడినట్లు గుర్తించేందుకు పరీక్ష కేంద్రాల్లో రాపిడ్​, ఆర్​టీపీసీఆర్​ టెస్టులు చేసుకోవాలి. అయితే.. పరీక్ష వసతులు అంతగా లేనిచోట, టెస్టింగ్​ కిట్లను సమర్థంగా వినియోగించేందుకు, బాధితులను గుర్తించేందుకు పరిశోధకులు 7 లక్షణాలను సూచించారు. ఆ లక్షణాలేమిటి?

corona virus symptoms
కరోనా వైరస్​ లక్షణాలు

By

Published : Sep 30, 2021, 7:25 AM IST

కొవిడ్‌ పరీక్ష వసతులు(corona testing centre) అంతగా లేనిచోట- టెస్టింగ్‌ కిట్లను(covid testing kit) సమర్థంగా వినియోగించేందుకూ, బాధితులు ఎవరై ఉండొచ్చన్న అంచనాకు వచ్చేందుకూ.. పరిశోధకులు 7 లక్షణాలను పేర్కొన్నారు. ఇవన్నీ ఉన్నవారికి మహమ్మారి(Corona virus) సోకి ఉండవచ్చన్న ప్రాథమిక అంచనాకు రావచ్చని సూచించారు.

లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌కు చెందిన శాస్త్రవేత్తలు 2020 జూన్‌ నుంచి 2021 జనవరి మధ్య కొవిడ్‌ పరీక్షలు(Covid testing) చేయించుకున్న వారిని పలు ప్రశ్నలు అడిగారు. టెస్టింగ్‌కు ముందు వారిలో ఎలాంటి లక్షణాలు(Covid symptoms) ఉన్నాయో తెలుసుకున్నారు. తర్వాత వీటన్నింటినీ మదింపు చేసి, ఏడు ఉమ్మడి లక్షణాలను ఎంపిక చేశారు. ఇవన్నీ ఉన్నవారిలో 70-75 శాతం మందికి పీసీఆర్‌ పరీక్షల్లో పాజిటివ్‌ ఫలితం రావడం గమనార్హం.

" రుచి, వాసనలను కోల్పోవడం లేదా వాటిని గుర్తించే సామర్థ్యం తగ్గడం, చలి, దగ్గు, జ్వరం, కండరాల నొప్పులు, ఆకలి మందగించడం- ఈ లక్షణాలు ఉన్నవారికి కరోనా సోకిందని ప్రాథమికంగా భావించవచ్చు. కిట్ల కొరత ఉన్నప్పుడు ముందుగా ఇలాంటి వారికి పరీక్షలు నిర్వహించాలి. తర్వాత మిగతా వారికి కూడా పరీక్షలు చేపట్టడం మేలు. కరోనా సోకినా కొందరిలో ఎలాంటి లక్షణాలు ఉండటం లేదన్న విషయాన్ని మాత్రం విస్మరించకూడదు"

- పరిశోధకులు.

పబ్లిక్‌ లైబ్రరీ ఆఫ్‌ సైన్స్‌ మెడిసిన్‌ పత్రిక ఈ వివరాలను అందించింది.

ఇదీ చూడండి:కరోనా చికిత్సలో ఆ మందులు వాడొద్దు: ఐసీఎంఆర్​

ABOUT THE AUTHOR

...view details