తెలంగాణ

telangana

ETV Bharat / international

Vaccination: 'ఆ దేశాలు వ్యాక్సినేషన్‌ వేగం పెంచాలి' - ఆగ్నేయాసియా దేశాల్లో కరోనా వ్యాప్తి

మరో కొవిడ్ ఉద్ధృతి రాకముందే ఆరోగ్య వసతులు పెంచాలని ఆగ్నేయాసియా దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) సూచించింది. ఆర్థిక వ్యవస్థలను తిరిగి తెరుస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను(Vaccination) వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసింది. భౌతిక దూరం, చేతులు శుభ్రపరుచుకోవడం, మాస్కులు ధరించడం తప్పనిసరి అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

WHO
డబ్ల్యూహెచ్​ఓ

By

Published : Jun 20, 2021, 8:51 PM IST

కొవిడ్ మరో ఉద్ధృతి రాకమునుపే.... ఆరోగ్య మౌలిక వసతులు పెంచి, వ్యాక్సినేషన్‌ను(Vaccination) వేగవంతం చేయాలని ఆగ్నేయాసియా దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) కోరింది. కొత్త కరోనా వేరియంట్లు వ్యాపిస్తున్నట్లు మాల్దీవులు, మయన్మార్‌ ప్రకటించిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్​ఓ ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్, భారత్, ఇండోనేషియా, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్‌లలో వేర్వేరు కొవిడ్‌ వేరియంట్లు వ్యాపిస్తున్నట్లు ఇదివరకే తేలింది.

లాక్‌డౌన్‌ల నుంచి ఆర్థిక వ్యవస్థలను తిరిగి తెరుస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్​ఓ సూచనలు చేసింది. భౌతిక దూరం, చేతులు శుభ్రపరుచుకోవడం, సరిగ్గా మాస్కులు ధరించడం వంటి చర్యలను పక్కాగా అమలు చేయాలని పేర్కొంది. కొవిడ్ వ్యాప్తి విషయంలో వివిధ దేశాలు వివిద దశల్ని ఎదుర్కొంటున్నట్లు డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. కాబట్టి వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసి.. దిగువ స్థాయి ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రజారోగ్య చర్యలను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఇదీ చూడండి:5 లక్షల కరోనా మరణాలు- అధ్యక్షుడిపై ప్రజల ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details