కరోనా నుంచి కోలుకున్నవారిలో ఏడు నెలల తర్వాత కూడా యాంటీబాడీలు స్థిరంగా కొనసాగుతున్నట్లు లండన్ శాస్త్రవేత్తలు తేల్చారు. కొంతమందిలో అవి పెరగడాన్ని సైతం గమనించినట్లు స్పెయిన్‌లోని బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సాధారణ జలుబును కలిగించే కరోనా వైరస్‌లను లక్ష్యంగా చేసుకొనే యాంటీబాడీలు ఉన్నవారికీ కొవిడ్ నుంచి రక్షణ లభించొచ్చని తెలిపారు.
ఏడు నెలల పాటు స్థిరంగా యాంటీబాడీలు! - ఏడు నెలల తర్వాత కూడా యాంటీబాడీలు
యాంటీబాడీలపై లండన్ శాస్త్రవేత్తలు కీలక విషయాలను వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్నవారిలో ఏడు నెలల తర్వాత కూడా యాంటీబాడీలు స్థిరంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. జీఎం, ఐజీజీ యాంటీబాడీలు మినహా.. మిగతా యాంటీబాడీలు స్థిరంగా కొన్ని నెలల పాటు కొనసాగినట్లు నిపుణులు తేల్చారు.
అంతకుముందు కొవిడ్ కారక సార్స్-కోవ్-2 వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ఎంత కాలం కొనసాగుతుందన్న దానిపై.. లండన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఇందుకోసం గతేడాది మార్చి నుంచి అక్టోబరు మధ్య 578 మంది ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది నుంచి నాలుగు భిన్న సమయాల్లో రక్త నమూనాలు సేకరించి పరిశీలించారు. కరోనాలోని న్యూక్లియోక్యాప్సిడ్‌ను లక్ష్యంగా చేసుకునే ఐజీఎం, ఐజీజీ యాంటీబాడీలు మినహా.. మిగతా యాంటీబాడీలు స్థిరంగా కొన్ని నెలల పాటు కొనసాగినట్లు నిపుణులు తేల్చారు.
ఇదీ చదవండి :అమెరికాపై కరోనా పంజా- ఒక్కరోజే 1.30లక్షల కేసులు