ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీని ఓ కేసులో దోషిగా తేల్చింది ఫ్రెంచ్ కోర్టు. సంవత్సరం జైలు శిక్ష విధించింది. అయితే.. ఎలక్ట్రానిక్ మానిటరింగ్ బ్రేస్లెట్ ధరించి ఇంట్లోనే శిక్ష పూర్తి చేసేందుకు న్యాయస్థానం అనుమతిస్తుంది.
2012 అధ్యక్ష ఎన్నికల సమయంలో అక్రమంగా నిధులు సేకరించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులోనే ఇప్పుడు సర్కోజీని కోర్టు దోషిగా తేల్చింది.